అప్పుడు 'ఇదంతా మనదే'.. ఇప్పుడు 'నైజాం' అంతా రవితేజదే!
మాస్ మహారాజా రవితేజ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది ఎనర్జీ.. ఆ తర్వాత గుర్తొచ్చేది మాస్.
By: M Prashanth | 11 Sept 2026 1:44 PM ISTమాస్ మహారాజా రవితేజ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది ఎనర్జీ.. ఆ తర్వాత గుర్తొచ్చేది మాస్. కెరీర్ లో ఎన్నో సినిమాలు చేసినా.. కొన్ని మూవీలు మాత్రం ఆయన ఇమేజ్ ను మరో రేంజ్ కి తీసుకెళ్లాయి. అందులో ఇడియట్ కు స్పెషల్ ప్లేస్ ఉందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు ఇప్పుడు అదే రవితేజ నటించిన ఇరుముడి మూవీ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన మాస్ స్టామినాను చూపిస్తోంది.
రీసెంట్ గా జరిగిన ఇరుముడి సక్సెస్ మీట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ ఆ సక్సెస్ కు మరింత మాస్ టచ్ ఇచ్చాయి. రవితేజ నటించిన ఇడియట్ సినిమాలోని ఓ సీన్ ను గుర్తు చేసుకున్న ఆయన.. 'ఇదంతా మనదే' అనే డైలాగ్ ను స్టేజ్ పై చెప్పారు. ఇప్పుడు ఇరుముడి విషయంలో నైజాం మనదే అంటూ సరదాగా చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా ఫుల్ గా నవ్వేశారు.
అయితే ఆ కామెంట్ కేవలం ఫన్ కోసం చెప్పినదే కాదు.. నైజాంలో ఇరుముడి సాధిస్తున్న వసూళ్లను చూస్తే ఆ కామెంట్ కు ఓ రేంజ్ కనిపిస్తోంది. ఎందుకంటే సినిమా విడుదలై 20 రోజులు పూర్తయ్యే సరికి నైజాం ప్రాంతంలో రూ.56.93 కోట్ల షేర్ సాధించింది. గ్రాస్ ఇప్పటికే రూ.76 కోట్లను దాటింది. ఇదే జోష్ కొనసాగితే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ కూడా అందుకునే అవకాశం ఉంది. భారీ లాభాలను తెచ్చిపెడుతోంది.
ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం రవితేజ తీసుకున్న రెమ్యునరేషన్. ఆ సినిమాకు పూర్తి పారితోషికం తీసుకోకుండా నైజాం థియేట్రికల్ హక్కులను రెమ్యునరేషన్ గా తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు నైజాంలో సినిమా ఇంత భారీగా వసూళ్లు సాధించడంతో.. ఆ నిర్ణయం రవితేజకు పెద్ద ప్లస్ గా మారినట్టే కనిపిస్తోంది. ఇక ఇరుముడి కథ కూడా రవితేజకు కొత్తగా అనిపించేలా ఉంది.
ఒకప్పుడు రౌడీగా ఉన్న వ్యక్తి.. తర్వాత మద్యానికి బానిసై తన జీవితాన్ని కోల్పోయిన తండ్రి రోల్ లో ఆయన కనిపించారు. తన కూతురి కోరికతో అయ్యప్ప దీక్ష తీసుకునే వేళ ఆయన లైఫ్ లో వచ్చే మార్పుల చుట్టూ కథ సాగుతుంది. యాక్షన్ తో పాటు తండ్రీకూతుళ్ల ఎమోషన్ కూడా సినిమాకు మెయిన్ అసెట్ గా మారింది. అదే సమయంలో రవితేజ, అనిల్ రావిపూడి కాంబినేషన్ ను కూడా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
వీరిద్దరి కాంబోలో వచ్చిన రాజా ది గ్రేట్ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇరుముడి సక్సెస్ మీట్‌లో అనిల్ రావిపూడి రవితేజ ఐకానిక్ మూవీని గుర్తు చేయడం.. ఆ డైలాగ్ తో కొత్త సినిమా సక్సెస్ ను కలపడం ఇంట్రెస్టింగ్ మారింది. అయితే ఇడియట్ తో మాస్ హీరోగా రవితేజకు వచ్చిన క్రేజ్.. ఇన్నేళ్ల తర్వాత కూడా ఎక్కడా తగ్గలేదని ఇరుముడి మరోసారి క్లియర్ గా చూపిస్తోంది. అలా నైజాంలో భారీ వసూళ్లు రావడం, ప్రపంచవ్యాప్తంగా రూ.230 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం.. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు అనిల్ రావిపూడి చెప్పినట్టు.. ఇదంతా మనదే అని చెప్పుకునేంతగా నైజాం బాక్సాఫీస్ వద్ద రవితేజ సందడి చేస్తున్నట్లే!
