Begin typing your search above and press return to search.

థియేటర్లో టికెట్ తెగాలంటే.. రావిపూడి లాజిక్

దీనికి సంబంధించి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి 'దండోరా' ఈవెంట్ లో ఒక ఇంట్రెస్టింగ్ క్లారిటీ ఇచ్చారు.

By:  M Prashanth   |   23 Dec 2025 11:11 AM IST
థియేటర్లో టికెట్ తెగాలంటే.. రావిపూడి లాజిక్
X

ఈ మధ్య కాలంలో సినిమా అంటే ప్రమోషన్, ప్రమోషన్ అంటే సినిమా అనే రేంజ్ లో పరిస్థితి మారిపోయింది. సినిమా తీయడం ఒక ఎత్తైతే, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తుగా మారింది. అయితే ఎంత హడావిడి చేసినా, ఆడియన్స్ థియేటర్ కు వస్తారా లేదా అనేది ఎప్పుడూ ఒక పజిల్ గానే ఉంటుంది. దీనికి సంబంధించి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి 'దండోరా' ఈవెంట్ లో ఒక ఇంట్రెస్టింగ్ క్లారిటీ ఇచ్చారు.

ముఖ్యంగా కొత్తగా వచ్చే దర్శకులకు, చిన్న సినిమా నిర్మాతలకు ఒక భయం ఉంటుంది. భారీగా ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేయలేకపోతే మన సినిమాను ఎవరూ చూడరేమో అని కంగారు పడుతుంటారు. కానీ ఆ భయం అవసరం లేదని, సినిమా గెలవడానికి కావాల్సింది ప్రమోషన్ల హోరు కాదని అనిల్ రావిపూడి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఆయన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.

అసలు విషయం ఏంటంటే.. అనిల్ రావిపూడి సినిమా సక్సెస్ కు సంబంధించిన ఒక బేసిక్ లాజిక్ ని బయటపెట్టారు. "ప్రమోషన్స్ అనేవి కేవలం ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ కంటెంట్ మాత్రమే థియేటర్లో టికెట్ తెంపడానికి ఉపయోగపడుతుంది" అని కుండబద్దలు కొట్టారు. అంటే పబ్లిసిటీతో తల తిప్పుకునేలా చేయొచ్చు కానీ, జేబులోంచి డబ్బులు తీసి టికెట్ కొనేలా చేసే సత్తా కేవలం కథకే ఉంటుందన్నమాట.

"ప్రమోషన్ లేదు కదా, మన సినిమా చూస్తారా లేదా అని అనుకోవద్దు.. ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్" అని అనిల్ గుర్తుచేశారు. ప్రేక్షకులకు ఏం కావాలో వారికి బాగా తెలుసు. ఒక్క టీజర్ లేదా ట్రైలర్ లో కంటెంట్ నచ్చితే చాలు.. మార్నింగ్ షోకే టికెట్లు తెగుతాయని భరోసా ఇచ్చారు. ఈ మధ్య కాలంలో చాలా చిన్న సినిమాలు కేవలం మౌత్ టాక్ తోనే బ్లాక్ బస్టర్లు అయ్యాయంటే కారణం ఈ స్మార్ట్ ఆడియన్సే కదా.

గత సెప్టెంబర్ నుంచి టాలీవుడ్ టైమ్ చాలా బాగుందని, ముఖ్యంగా చిన్న సినిమాలు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాయని అనిల్ విశ్లేషించారు. కంటెంట్ బలంగా ఉంటే సినిమా చిన్నదా, పెద్దదా అని చూడకుండా ఆదరించే గొప్ప మనసు తెలుగు ప్రేక్షకులకు ఉందని, ఇది ఇండస్ట్రీకి చాలా పాజిటివ్ సైన్ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫైనల్ గా ఈ డిసెంబర్ 25న వస్తున్న సినిమాలన్నీ మంచి కంటెంట్ తో వస్తున్నాయని, మీకు నచ్చిన సినిమాలను థియేటర్లలో చూసి ఎంకరేజ్ చేయాలని కోరారు. 'దండోరా' టీమ్ కంటెంట్ ని నమ్ముకుని వస్తున్నారు కాబట్టి, ఆ సినిమాకు కూడా తన బెస్ట్ విషెస్ అందించారు. మొత్తానికి అనిల్ చెప్పినట్లు.. ప్రమోషన్ అనేది ఆహ్వానం మాత్రమే, అసలైన విందు భోజనం సినిమానే అని ఫిక్స్ అవ్వాల్సిందే. ఇక దండోరా సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.