ఎన్టీఆర్-అనిల్ మూవీపై ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..!
2027 సంక్రాంతికి వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో ‘జనవరి 12 విడుదల’ తీసుకొస్తున్న అనిల్ రావిపూడి, 2028 సంక్రాంతికి ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘దాన వీర శూర’ అనే టైటిల్ పరిశీలనలో ఉందనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ కామెడీ టైమింగ్‌ను అనిల్ తనదైన శైలిలో చూపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
By: Ramesh Palla | 16 Nov 2026 4:41 PM ISTటాలీవుడ్ దర్శకుల్లో అనిల్ రావిపూడి శైలి విభిన్నం. ఆయన కెరీర్ ఆరంభం నుంచి వరుసగా హిట్ బొమ్మలు తీస్తూ, సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా నిలిచాడు. అన్నీ కామెడీ మూవీస్ మాత్రమే కాకుండా మధ్యలో బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమాను సీరియస్ ఇష్యూపైనా సినిమాను తీయడం ద్వారా హిట్ కొట్టాడు. కామెడీ మాత్రమే అనిల్ రావిపూడి బలం అనుకున్న వారికి ఆ సినిమా గట్టి సమాధానం చెప్పింది అనడంలో సందేహం లేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు అనిల్ రావిపూడి సినిమాలను క్రింజ్ అంటూ విమర్శించిన వారు సైతం ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మన శంకర వర ప్రసాద్ సినిమాతో ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో జనవరి 12 విడుదల సినిమాను తీస్తున్న విషయం తెల్సిందే. 2027 సంక్రాంతికి ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే 2028 సంక్రాంతి సినిమాను అనిల్ రావిపూడి కన్ఫర్మ్ చేశాడు.
2027 సంక్రాంతి కి జనవరి 12 విడుదల...
సాధారణంగా ఒక సినిమా విడుదలైన తర్వాత అనిల్ రావిపూడి కొత్త సినిమాను ప్రకటిస్తాడు. కానీ 2027 సంక్రాంతి మూవీ జనవరి 12 విడుదల ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే ఎన్టీఆర్‌తో సినిమాను ప్రకటించాడు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌తో అనిల్ రావిపూడి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయింది. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాను తీయడం ద్వారా స్టార్ హీరోలను అనిల్ రావిపూడి డీల్ చేయగలడు అని నిరూపించుకున్నాడు. చిరంజీవి వంటి మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్లుగా కామెడీని పండించాడు. కనుక ఎన్టీఆర్ తో అదుర్స్ వంటి అద్భుతమైన ఎంటర్‌టైనర్ మూవీని కచ్చితంగా అనిల్ రావిపూడి రూపొందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఆ మద్య ఒక స్టార్ హీరోతో చిన్న దర్శకుడు, కామెడీ చిత్రాల దర్శకుడు సినిమాను ప్రకటించిన వెంటనే ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ వద్దంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మనం చూశాం.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్...
ఫ్యాన్స్ అనుకున్నట్లుగానే ఆ స్టార్ హీరోతో ఆ కామెడీ చిత్రాల దర్శకుడు తీసిన సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. కానీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా అనే వార్తలు వస్తున్న ఈ సమయంలో ఫ్యాన్స్ మాత్రం ఏ ఒక్కరూ నెగిటివ్‌గా రియాక్ట్ రావడం లేదు. కచ్చితంగా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది, ఎన్టీఆర్‌లోని కామెడీ యాంగిల్ ను దర్శకుడు అనిల్ రావిపూడి తప్పకుండా పూర్తిగా వెలికి తీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫ్యాన్స్ రియాక్షన్ కి అనిల్ రావిపూడి కచ్చితంగా హ్యాపీగా ఉండే ఉంటాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ వంటి అత్యంత సీరియస్, యాక్షన్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. డ్రాగన్ కోసం ఎన్టీఆర్ చాలా కాలంగా కష్టపడుతున్నాడు. వచ్చే ఏడాదిలో సినిమా విడుదల కానుంది. డ్రాగన్ తర్వాత వెంటనే ఒక ఫుల్ లెంగ్త్ అనిల్ మార్క్ కామెడీ మూవీ రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఇదో మంచి పరిణామం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ హీరోగా దాన వీర శూర మూవీ...
ఈ సినిమాకు 'దాన వీర శూర' అనే టైటిల్‌ను అనిల్ రావిపూడి పరిశీలిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ కెరీర్‌లో కామెడీ పాత్రలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ను అదుర్స్ సినిమాలో చూసిన ఫ్యాన్స్, అప్పటి నుంచి మరోసారి పూర్తి స్థాయి కామెడీ మూవీ చేయాలని కోరుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో అనిల్ రావిపూడి చేయబోతున్న మూవీ కామెడీ మూవీ అయ్యి ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ సినిమాల మాదిరిగా ఉంటుందా లేదంటే బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా మాదిరిగా ఉంటుందా అనేది ఫ్యాన్స్ లో చర్చనీయాంశం అయింది. ఎన్టీఆర్‌తో అనిల్ రావిపూడి కామెడీ మూవీ చేయాలని నందమూరి ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ చూసి చాలా కాలం అయింది. కనుక ఆయన నుంచి అనిల్ మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్ వస్తే బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయం అనేది విశ్లేషకుల మాట. పాన్ ఇండియా మూవీ కాకున్నా కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడితే రూ.500 కోట్ల వసూళ్లు నమోదు అయినా ఆశ్చర్యం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
