Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ నుంచి సిగ్నల్ వచ్చిందంటే మాత్రం..!

OG సినిమాతో పవర్ స్టార్ సూపర్ కంబ్యాక్ ఇచ్చారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆయన్ను ఇలా చూడాలని అనుకుంటుంటే ఏదేదో సినిమాలు చేసి నిరాశ పరిచారు.

By:  Ramesh Boddu   |   13 Oct 2025 10:40 AM IST
పవర్ స్టార్ నుంచి సిగ్నల్ వచ్చిందంటే మాత్రం..!
X

OG సినిమాతో పవర్ స్టార్ సూపర్ కంబ్యాక్ ఇచ్చారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆయన్ను ఇలా చూడాలని అనుకుంటుంటే ఏదేదో సినిమాలు చేసి నిరాశ పరిచారు. ఫైనల్ గా ఓజీతో వాళ్లకు ఫుల్ మీల్స్ పెట్టాడు సుజీత్. ఓజీ ప్రీక్వెల్, సీక్వెల్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ గురించి తెలిసిందే. ఐతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ ని పూర్తి చేసి నెక్స్ట్ సినిమాలకు లాంగ్ గ్యాప్ తీసుకుంటాడని తెలుస్తుంది. ఉస్తాద్ పూర్తి కాగానే పూర్తిస్థాయిలో రాజకీయాల మీద ఫోకస్ చేయనున్నారట.

డిప్యూటీ సీఎం గా ఉంటూనే ఇటు సినిమాలు..

డిప్యూటీ సీఎం గా ఉంటూనే ఇటు సినిమాలు చేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఐతే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వీరమల్లు సినిమా టైం లో పెద్దగా కనిపించని దిల్ రాజు ఓజీ సినిమా నైజాం ని రిలీజ్ చేశారు. రీసెంట్ గా ఓజీ నైజాంలో బ్రేక్ ఈవెన్ అంటూ ఓజీ ఆడుతున్న ఓ థియేటర్ లో సెలబ్రేషన్స్ లో కూడా పాల్గొన్నారు దిల్ రాజు. అక్కడే పవర్ స్టార్ తో సినిమా చేస్తానని అన్నారు.

పవన్ కళ్యాణ్ ని ఎలాగైనా కన్విన్స్ చేసి దిల్ రాజు తన బ్యానర్ లో సినిమా చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఆ సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది మాత్రం క్లారిటీ లేదు. దిల్ రాజు బ్యానర్ లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా చేశారు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా సక్సెస్ అయ్యింది. ఐతే ఆఫ్టర్ వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ తో ఒక పవర్ ప్యాక్డ్ మూవీ చేయాలని చూస్తున్నారు దిల్ రాజు.

ఏ స్టార్ కి తగ్గట్టుగా ఆ స్టార్ కి స్టోరీ సెట్ చేసి..

అందుకే తన బ్యానర్ లో సినిమాలు చేస్తూ అన్ని హిట్లు అందించిన అనిల్ రావిపూడితోనే దిల్ రాజు సినిమా చేస్తాడని తెలుస్తుంది. అనిల్ రావిపూడి ఏ స్టార్ కి తగ్గట్టుగా ఆ స్టార్ కి స్టోరీ సెట్ చేసి సూపర్ హిట్లు కొడుతున్నాడు. వెంకటేష్ తో 3 సినిమాలు తీసి 3 సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వర ప్రసాద్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత దిల్ రాజు, అనిల్ రావిపూడి కలిసి పవన్ కళ్యాణ్ తో సినిమాకు రెడీ అవుతున్నారట.

ఐతే అనిల్ రావిపూడి పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తే అందులో ఆయన పొలిటికల్ కెరీర్ కి ఉపయోగ పడేలా ఏదైనా ఒక బలమైన కథతో తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో తీసుకు రావాలి. మరి పవన్ కోసం అనిల్ అలాంటి స్టోరీ ఇస్తాడా లేదా అన్నది చూడాలి.