అనిల్ రావిపూడికి నెక్స్ట్ సినిమా లైన్ అక్కడ దొరికిందా..?
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ని ప్రస్తుతం టాలీవుడ్ హిట్ మిషన్ అని అందరు అంటున్నారు.
By: Ramesh Boddu | 29 Jan 2026 3:18 PM ISTసక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ని ప్రస్తుతం టాలీవుడ్ హిట్ మిషన్ అని అందరు అంటున్నారు. ఆయన తీసిన సినిమా పండగకి రావడం హిట్టు కొట్టడం ఇది రిపీట్ అన్నట్టుగా ఉంది. పటాస్ నుంచి రీసెంట్ రిలీజ్ మన శంకర వరప్రసాద్ వరకు అనిల్ రావిపూడి సినిమా అంటే ఆడియన్స్ పక్కా హిట్టే అనే రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఎం.ఎస్.జి లాంటి ఫ్యాన్ ఫీస్ట్ హిట్ అందించడం తో అతని రేంజ్ మరింత పెరిగింది.
అనిల్ నెక్స్ట్ సినిమా కథ లైన్ సెట్..
అనిల్ రావిపూడి 9 సినిమాలు తీసి 9 సక్సెస్ అందుకున్నాడు. ఈ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న డిస్కషన్ అయితే జోరుగా నడుస్తుంది. ఐతే రీసెంట్ ఇంటర్వ్యూలో అనిల్ నెక్స్ట్ సినిమా కథ లైన్ సెట్ అయ్యిందని అన్నాడు. తాను ఎప్పుడు కథ రాయాలని అనుకున్నా వైజాగ్ వెళ్తానని చెప్పిన అనిల్ రావిపూడి. వైజాగ్ ఫ్లైట్ దిగగానే ఒక లైన్ తట్టింది. అక్కడ తన టీం తో బీచ్ లో డిస్కస్ చేసి ఫైనల్ చేసినట్టు చెప్పుకొచ్చారు. డైరెక్టర్స్ కి ఒక్కొక్కరికి ఒక్కోచోట స్టోరీ సిట్టింగ్స్ జరుగుతాయి. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఏ కథ రాయాలన్నా సరే బ్యాంకాక్ వెళ్లేవాడు. అనిల్ రావిపూడి మాత్రం వైజాగ్ వెళ్తే చాలు అలా కథ రాసుకొచ్చేస్తాడు.
సో లైన్ ఓకే ఇక దానికి తారాగణం ఎవరన్నది ఎంపిక చేయాల్సి ఉంది. అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా హీరో ఎవరన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ తోనే సంక్రాంతికి వస్తున్నా సీక్వెల్ చేస్తారని సోషల్ మీడియాలో హంగామా నడుస్తుంది. ఐతే చిరంజీవి సినిమాలో కూడా తన లక్కీ సెంటిమెంట్ గా వెంకటేష్ ని కొనసాగించిన అనిల్ నెక్స్ట్ వెంకీ సార్ తోనే సినిమా ఫిక్స్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని టాక్.
అనిల్ ఏం చేయాలనుకున్నా సరే..
వెంకటేష్ మాత్రమే కాదు అనిల్ ఈసారి దగ్గుబాటి మల్టీస్టారర్ గా రానాని కూడా ఈ ప్రాజెక్టు లోకి తీసుకుంటున్నాడని అంటున్నారు. ఏది ఏమైనా హిట్ ఫాం లో ఉన్న డైరెక్టర్ కాబట్టి అనిల్ ఏం చేయాలనుకున్నా సరే ప్రొడ్యూసర్స్ రెడీ అనేస్తారు. దిల్ రాజుతో మంచి కొలాబరేషన్ కొనసాగించిన అనిల్ రావిపూడి ఎస్.వి.సి బ్యానర్ కాకుండా సాహు గారపాటితోనే రెండు సినిమాలు చేశాడు. ఐతే నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడన్నది చూడాలి.
అనిల్ రావిపూడి సినిమా అంటే హీరోలే కాదు హీరోయిన్స్ కూడా రెడీ అనేస్తున్నారు. పండగకి సినిమా.. ఫ్యామిలీ మొత్తం చూసే మంచి ఎంటర్టైనర్ లో నటించాలని ఎవరి ఉండదు. అందుకే యువ హీరోయిన్స్ నుంచి స్టార్ హీరోయిన్స్ కూడా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
