Begin typing your search above and press return to search.

రాజు గారికి దొరకని రావిపూడి..?

ఐతే సంక్రాంతికి వస్తున్నాం హిట్ పడగానే మళ్లీ దిల్ రాజుతోనే అనిల్ సినిమా ఉంటుందని అనుకోగా ఆల్రెడీ సాహుతో ప్రాజెక్ట్ కమిటై మన శంక్రాంతికి వస్తున్నాం తో మరో సూపర్ హిట్ ఇచ్చాడు.

By:  Ramesh Boddu   |   7 Feb 2026 12:20 PM IST
రాజు గారికి దొరకని రావిపూడి..?
X

టాలీవుడ్ హిట్ మిషన్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. దర్శకుడిగా పటాస్ నుంచి ఈ సంక్రాంతికి వచ్చిన మన శంకర వరప్రసాద్ వరకు అతను తీసిన సినిమా హిట్ పక్కా అనేలా క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ కి అనిల్ రావిపూడి నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ డైరెక్టర్ తో సినిమాలు చేసేందుకు మేకర్స్ ఆసక్తిగా ఉన్నారు. ఐతే తన మొదటి సినిమా పటాస్ ని కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ లో చేసిన అనిల్ రావిపూడి ఆ తర్వాత సుప్రీం నుంచి వరుస సినిమాలు దిల్ రాజు బ్యానర్ లోనే చేశాడు.

బాలకృష్ణ తో చేసిన భగవంత్ కేసరి..

దిల్ రాజుతో వరుస సినిమాలు చేస్తూ వచ్చిన అనిల్ రావిపూడి బాలకృష్ణ తో చేసిన భగవంత్ కేసరి సినిమా మాత్రం షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటితో చేశాడు. ఆ సినిమా సక్సెస్ అవ్వడమే కాదు నేషనల్ అవార్డ్ కూడా తీసుకొచ్చింది. ఆ సినిమాతో నిర్మాత సాహు, డైరెక్టర్ అనిల్ కాంబినేషన్ కి డిమాండ్ పెరిగింది. మధ్యలో దిల్ రాజుతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేశాడు అనిల్ రావిపూడి. గేమ్ ఛేంజర్ లాసుల నుంచి దిల్ రాజుని కాస్త ఒడ్డెంకించే ప్రయత్నం చేశాడు.

ఐతే సంక్రాంతికి వస్తున్నాం హిట్ పడగానే మళ్లీ దిల్ రాజుతోనే అనిల్ సినిమా ఉంటుందని అనుకోగా ఆల్రెడీ సాహుతో ప్రాజెక్ట్ కమిటై మన శంక్రాంతికి వస్తున్నాం తో మరో సూపర్ హిట్ ఇచ్చాడు. ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా కూడా సాహు గారపాటి ప్రొడక్షన్ లోనే ఉంటుందని తెలుస్తుంది. దిల్ రాజుతో దాదాపు ఆరేడు సినిమాలు చేసిన అనిల్ రావిపూడి ఇప్పుడు సాహుతో కలిసి వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ ని హోల్డ్ చేసి..

సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ ని హోల్డ్ చేసి వారితో సినిమాలు చేయడం దిల్ రాజుకి బాగా తెలుసు. కానీ ఇప్పుడు అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్ అయ్యాడు అదీగాక డిమాండ్ ఉన్న డైరెక్టర్ అయ్యాడు. సో అతను బయట నిర్మాతలతో సినిమాలు చేయక తప్పట్లేదు. అంతేకాదు అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ విషయంలో కూడా బిజినెస్ షేర్ లాంటివి తీసుకుంటాడన్న టాక్ ఉంది. సాహుతో ఆ డీల్ బాగుంది కాబట్టే దిల్ రాజుని వదిలి ఆయనతో వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. సో ఈ దూకుడు చూస్తుంటే సాహు, అనిల్ రావిపూడి 3వ సినిమాతో ఆగేలా లేరు. ఇదే కొనసాగితే మాత్రం దిల్ రాజుకి అనిల్ రావిపూడి దొరికే ఛాన్స్ లేదని చెప్పొచ్చు.

ఇక అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా వెంకటేష్ తోనే కన్ఫర్మ్ అయ్యింది. సంక్రాంతికి వస్తున్నాం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ కలయికలో మరో క్రేజీ సినిమా రాబోతుంది. ఐతే ఈ సినిమాలో మరో స్టార్ కూడా నటిస్తాడన్న టాక్ వినిపిస్తుంది. అది రానా అయితే దగ్గుబాటి మల్టీస్టారర్ చూసేందుకు ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు.