Begin typing your search above and press return to search.

హిట్ మెషిన్ రేసులో ఇద్ద‌రు హీరోలా?

హిట్ మెషిన్ అనీల్ రావిపూడికి ఇంత వ‌ర‌కూ వైఫ‌ల్యం ఎదుర‌వ్వ‌లేదు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప జ‌యం ఎరుగ‌ని మ‌రో ద‌ర్శ‌కుడిగా రికార్డు సృష్టించాడు.

By:  Srikanth Kontham   |   13 Jan 2026 8:15 AM IST
హిట్ మెషిన్ రేసులో ఇద్ద‌రు హీరోలా?
X

హిట్ మెషిన్ అనీల్ రావిపూడికి ఇంత వ‌ర‌కూ వైఫ‌ల్యం ఎదుర‌వ్వ‌లేదు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప జ‌యం ఎరుగ‌ని మ‌రో ద‌ర్శ‌కుడిగా రికార్డు సృష్టించాడు. రాజ‌మౌళి త‌ర్వాత రాజమౌళి అంత‌టి వాడిగా నీరాజ‌నాలు అందుకుంటున్నాడు. తాను తీసేవి గొప్ప క‌థ‌లు కాక‌పోయినా ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేస్తున్నాడు. నిర్మాత‌కు లాభాలు తెచ్చి పెడుతున్నాడు. హీరోల‌కు వ‌రుస విజ‌యాలు అందిస్తున్నాడు. ఇప్ప‌టికే ఎనిమిది వ‌రుస విజయాలు అందుకున్న అనీల్ తాజాగా రిలీజ్ అయిన `మ‌న‌శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు` తో తొమ్మిద‌వ స‌క్సెస్ ను కూడా ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సంక్రాంతి కూడా అనీల్ దే అనిపించాడు. మిగ‌తా మూడు చిత్రాల రిలీజ్ అనంత‌రం ఎమ్ ఎస్ జీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుంది? అన్న‌ది ఓ అంచ‌నా వ‌స్తుంది. ఇప్ప‌టికే అనీల్ ఖాతాలో వ‌రుస‌గా ట్రిపుల్ హ్యాట్రిక్ న‌మోదైన‌ట్లే. దీంతో అనీల్ 10వ సినిమా ఏ హీరోతో ఉంటుంది? అనే చ‌ర్చ మొదలైంది. ఆయ‌న సినిమా మొద‌లు పెడితే గ‌నుక ఇదే ఏడాదే ఆ సినిమా రిలీజ్ అవుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. సంవత్స‌రాల పాటు హీరో, నిర్మాత‌ల స‌మ‌యాన్ని తినే ద‌ర్శ‌కుడు కాదు. కాబ‌ట్టి పద‌వ సినిమా ఏడాది ముగింపులోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే అవ‌కాశం ఉంది.

అయితే అందులో హీరో ఎవ‌ర‌వుతారు? అన్న‌దే ఆస‌క్తిక‌రం. ఇప్ప‌టికే కింగ్ నాగార్జున పేరు జోరుగా వినిపిస్తోంది. అనీల్ కూడా కింగ్ విష‌యంలో పాజిటివ్ గా ఉన్నాడు. నాగ్ తో ప‌నిచేస్తే సీనియ‌ర్లు అంద‌ర్నీ క‌వ‌ర్ చేసిన‌ట్లు అవుతుంద‌ని భావిస్తున్నాడు. ఆ దిశ‌గా అనీల్ సీరియ‌స్ గానే ఆలోచ‌న చేస్తున్నాడు అన్న‌ది కాద‌న‌లేని నిజం. ఇదే జ‌రిగితే టాలీవుడ్ లో మొదటి న్యూ-ఏజ్ డైరెక్టర్‌గా అనిల్ అరుదైన గుర్తింపు ద‌క్కిన‌ట్లే. ప్ర‌స్తుతం నాగార్జున త‌న 100వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పై మ‌రో రెండు నెల‌ల్లో క్లారిటీ వ‌స్తుంది.

అనంత‌రం నాగ్ షెడ్యూల్ కూడా బ‌య‌ట‌కు వ‌స్తుంది. దాన్ని బ‌ట్టి అనీల్ ప్లాన్ చేసే ఛాన్స్ లేక‌పోలేదు.అలాగే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన ఉన్నట్లు కూడా రావిపూడి ఇప్పటికే హింట్స్ ఇచ్చాడు. కానీ ఈ కాంబినేష‌న్ ఇప్ప‌టిక‌ప్పుడే రిపీట్ అవ్వ‌దు. అందుకు స‌మ‌యం ప‌డుతుంది. చిరంజీవి-వెంకేట‌ష్ తో మ‌ల్లీస్టార‌ర్ కూడా ఉంది కాబ‌ట్టి సీక్వెల్ కి కాస్త స‌మ‌యం తీసుకుంటాడు.

వెంకటేష్ కూడా మ‌రో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే దిల్ రాజు బ్యాన‌ర్లో అనీల్ మ‌రో సినిమా చేయాల్సి ఉంది. అందులో హీరో ఎవ‌రు? అన్న‌ది ఇంకా డిసైడ్ అవ్వ‌లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో రాజుగారు ముందుకొచ్చే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. కానీ అది జ‌రుగుతుందా? లేదా? అన్న‌ది చూడాలి.