డైరెక్టర్ లో అతను.. హీరోల్లో ఇతను.. నెక్స్ట్ లెవెల్ అంతే..!
డైరెక్టర్స్ లో అనిల్ ఎలా అయితే తన సినిమా మీద ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే విషయంలో క్రియేటివ్ గా ఉంటాడో.. హీరోల్లో నవీన్ పొలిశెట్టి కూడా అదే రేంజ్ ప్లానింగ్ తో వస్తున్నాడు.
By: Ramesh Boddu | 1 Dec 2025 10:12 AM ISTఒక సినిమా తీయడం ఈరోజుల్లో ఎలాగోలా చేస్తున్నారు కానీ ఆ సినిమాను ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా చేయడం అదే ప్రమోషన్స్ చేయడం మాత్రం చాలా పెద్ద స్టోరీగా ఉంది. స్టార్ సినిమా అయినా చిన్న బడ్జెట్ సినిమా అయినా జనాల్లో ఎప్పుడు డిస్కస్ చేసేలా ప్రమోషన్స్ చేస్తేనే ఫుట్ ఫాల్స్ పెరుగుతాయి.. టికెట్లు తెగుతాయి. ఐతే రాజమౌళి తను తీసే భారీ సినిమాలకు తగినట్టుగానే తన ప్రమోషనల్ ప్లానింగ్ కూడా ఉంటుంది. సినిమా నుంచి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ ఇవ్వాలన్నది మొత్తం ప్లానింగ్ అంతా రాజమౌళిదే అన్నమాట.
టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉన్న డైరెక్టర్..
ఇక ఆ తర్వాత తీసిన ప్రతి సినిమా సక్సెస్ అందుకుని టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉన్న డైరెక్టర్ గా మారాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు 8 సినిమాలు తీస్తే 8 ప్రేక్షకులను మెప్పించాయి. 9వ సినిమాగా మన శంకర వరప్రసాద్ వస్తుంది. అది కూడా సంక్రాంతికి పక్కా సూపర్ హిట్ అనే టాక్ నడుస్తుంది.
ఐతే అనిల్ రావిపూడి ఈ సినిమా ప్రమోషన్స్ ని వెరైటీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. చిరంజీవితో సినిమా ఓపెనింగ్ రోజే తన టీం అందరినీ పరిచయం చేస్తూ ఒక ప్రమోషనల్ వీడియో చేశాడు అనిల్. అంతేకాదు హీరోయిన్ నయనతారతో ఒక స్పెషల్ వీడియో చేశాడు. ఇలా తన కాన్సెప్ట్ తో సినిమా పట్ల ఆసక్తి పెంచుతున్నాడు.
నవీన్ పొలిశెట్టి కూడా అదే రేంజ్ ప్లానింగ్ తో..
డైరెక్టర్స్ లో అనిల్ ఎలా అయితే తన సినిమా మీద ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే విషయంలో క్రియేటివ్ గా ఉంటాడో.. హీరోల్లో నవీన్ పొలిశెట్టి కూడా అదే రేంజ్ ప్లానింగ్ తో వస్తున్నాడు. అనిల్ రావిపూడిది ఒక పంథా అయితే నవీన్ ది మరో పంథా.. తన సినిమా అనగనగా ఒక రాజు సంక్రాంతికి రిలీజ్ వస్తుండగా నవీన్ సినిమా ప్రమోషన్స్ ని తన మీద వేసుకున్నాడు. ఈమధ్యనే సాంగ్ రిలీజ్ టైంలో ఒక సర్ ప్రైజ్ వీడియోతో వచ్చిన నవీన్ నెక్స్ట్ సినిమా రిలీజ్ టైం లో కూడా వెరైటీ వీడియోస్ చేస్తాడని టాక్.
సో డైరెక్టర్స్ లో అనిల్ ఎలా అయితే తన సినిమాను బీభత్సంగా ప్రమోట్ చేస్తారో.. నవీన్ కూడా అలానే చేస్తారని తెలుస్తుంది. సంక్రాంతికి చిరంజీవి, ప్రభాస్ లాంటి హీరోల సినిమాలు వస్తున్నా కూడా నవీన్ అనగనగా ఒక రాజు సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని వస్తుంది. మరి డైరెక్టర్, హీరో ఈ ప్రమోషనల్ కాన్సెప్ట్ తో ఎవరి సినిమా ఎక్కువ సేల్ అయ్యేలా చేస్తారో.. ఎవరి సినిమా ఎక్కువ ఆడియన్స్ ని ఇష్టపడేలా చేస్తారో చూడాలి.
