Begin typing your search above and press return to search.

కింగ్ నాగార్జున.. రెండు పండగల టార్గెట్..?

నా సామిరంగ సక్సెస్ తర్వాత కింగ్ నాగార్జున సోలో సినిమా విషయంలో కాస్త ముందు వెనకగా ఉండగా ఈ గ్యాప్ లో లాస్ట్ ఇయర్ ధనుష్ తో కుబేర, రజనీకాంత్ తో కూలీ సినిమాలు చేశాడు.

By:  Ramesh Boddu   |   20 Jan 2026 10:00 PM IST
కింగ్ నాగార్జున.. రెండు పండగల టార్గెట్..?
X

నా సామిరంగ సక్సెస్ తర్వాత కింగ్ నాగార్జున సోలో సినిమా విషయంలో కాస్త ముందు వెనకగా ఉండగా ఈ గ్యాప్ లో లాస్ట్ ఇయర్ ధనుష్ తో కుబేర, రజనీకాంత్ తో కూలీ సినిమాలు చేశాడు. ఆ సినిమాల్లో నాగార్జున నటించడం వల్ల ఆ మూవీస్ కి క్రేజ్ వచ్చాయి కానీ అవి చేయడం వల్ల నాగార్జునకు పెద్దగా వచ్చింది ఏమి లేదు. కుబేర, కూలీ చూసిన అక్కినేని ఫ్యాన్స్ ఇంకా హర్ట్ అయ్యారని చెప్పడంలో సందేహం లేదు. ఐతే నాగార్జున సోలో సినిమా అదే 100వ సినిమా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సినిమా విషయంలో నాగార్జున చాలా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.

100వ సినిమా హిస్టరీలో నిలిచిపోయేలా..

ఆల్రెడీ డైరెక్టర్, స్టోరీ లాక్ అయినా కూడా అనౌన్స్ మెంట్ కోసమే ఇంత వెయిట్ చేస్తున్నారు అంటే ఆ ప్రాజెక్ట్ ని నాగార్జున ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థమవుతుంది. 100వ సినిమా హిస్టరీలో నిలిచిపోయేలా చేయాలనే ఆలోచనతో నాగార్జున ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారు. ఐతే ఆర్. రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న నాగార్జున 100వ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్రెడీ మొదలయ్యాయట. త్వరలోనే షూటింగ్ అప్డేట్ వస్తుందని తెలుస్తుంది.

ఐతే నాగార్జున 100వ సినిమానే కాదు 101వ సినిమా ప్లానింగ్స్ కూడా మొదలయ్యాయని టాక్. టాలీవుడ్ హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటివరకు తీసిన 9 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఐతే సీనియర్ హీరోలతో కలిసి అనిల్ రావిపూడి చేస్తున్న హిట్లు తెలిసిందే. వెంకటేష్ తో 3, బాలకృష్ణతో 1, చిరంజీవితో 1 సినిమా చేశాడు అనిల్ రావిపూడి. సంక్రాంతికి ఒక సినిమా తప్పకుండా ఉండేలా చూసుకుంటున్న అనిల్ రావిపూడి ఈసారి నెక్స్ట్ నాగార్జునతోనే సినిమా అనే అంటున్నారు.

నాగార్జున కూడా అనిల్ రావిపూడితో..

నాగార్జున కూడా అనిల్ రావిపూడితో సినిమాకు రెడీ అనేస్తున్నారట. నాగార్జున 100వ సినిమా త్వరలో మొదలై దసరాకి రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉందట. ఇక అనిల్ సినిమా కూడా ఫిక్స్ అయితే అది 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లానింగ్ ఉంటుంది. సో ఈ ఇయర్ దసరా ఆ తర్వాత ఆరు నెలల్లో వచ్చే సంక్రాంతి ఇలా రెండు పెద్ద పండగలకు నాగార్జున సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాగ్ 100వ సినిమాతో పాటే అనిల్ రావిపూడి సినిమా అనౌన్స్ మెంట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అనిల్ రావిపూడి తో నాగార్జున సినిమా చేస్తే ఒకప్పటి నాగ్ వింటేజ్ స్టైల్ ని దించేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అనిల్ కూడా సీనియర్ స్టార్స్ లో మిగిలిన కింగ్ నాగార్జున తోనే సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.