క్లియరెన్స్ రావాల్సింది కింగ్ నుంచే!
హిట్ మెషిన్ అనీల్ రావిపూడి ఇప్పటికే సీనియర్ హీరోలైనా చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణలతో సినిమాలు పూర్తి చేసాడు.
By: Srikanth Kontham | 13 Jan 2026 11:27 AM ISTహిట్ మెషిన్ అనీల్ రావిపూడి ఇప్పటికే సీనియర్ హీరోలైనా చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణలతో సినిమాలు పూర్తి చేసాడు. ఆ ముగ్గురుకి మర్చిపోలేని బ్లాక్ బస్టర్లు అందించాడు. వెంకటేష్ `ఎఫ్ -2`, `ఎఫ్ -3` సహా `సంక్రాంతికి వస్తున్నాం` లాంటి బ్లాక్ బస్టర్స్ తో తిరుగులేని విక్టరీ అందించాడు. `భగవంత్ కేసరి`తో నటసింహ బాలకృష్ణకు కెరీర్ లో గుర్తిండిపోయే విజయాన్ని ఇచ్చాడు. ఇటీవలే రిలీజ్ అయిన `మనశంకరవరప్రసాద్ గారు`తో మెగాస్టార్ చిరంజీవికి ఓ బ్లాక్ బస్టర్ ఇచ్చేసాడు. ఈ సంక్రాంతి చిరంజీవిదే అనిపించాడు. సీనియర్లల్లో మిగిలిపోయింది కింగ్ నాగార్జున ఒక్కరే.
ఆయనతో పని చేయడానికి అనీల్ రావిపూడి కూడా సిద్దంగా ఉన్నాడు. స్టోరీ ఒక్కటే సెట్ అయితే చాలు హిట్ మె|షిన్ దిగిపోతుంది. ఇప్పటికే అక్కినేని అభిమానులు కూడా నాగ్ తో సినిమా చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ లు షురూ చేసారు. మా కింగ్ తో సైతం ఓ సెంచరీ కొట్టించి అంటూ బాహాటంగానే అడుగుతున్నారు. ఆ విషయంలో అనీల్ రావిపూడి ఎంత మాత్రం తగ్గే దర్శకుడు కాదు. నాగ్ తో పనిచేసి ఇండస్ట్రీలో న్యూ ఏజ్ డైరెక్టర్ గా చరిత్ర సృష్టించాలని అనీల్ ఎంతో తహతహలాడుతున్నాడు. అయితే ఈ విషయంపై కింగ్ మాత్రం ఇంకా స్పందించలేదు.
గత కొన్ని నెలలుగా ఈ చర్చ సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. చిరంజీవి సినిమా సెట్ లో ఉండగానే ఈ రచ్చ మొదలైంది. ఇంతకాలం అనీల్ కూడా పెదవి చాటున దాచుకుని ఉన్నా? చివరికి ఓపెన్ అయిపోయాడు. కానీ నాగార్జున మాత్రం ఏ సందర్భంలోనూ మాట్లాడలేదు. ఇప్పుడాయనా మాట్లాడాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. ఇంతకాలం మౌనంగా ఉన్నా? నాగ్ కూడా పెదవి విప్పాల్సిన సమయం వచ్చేసింది. అనీల్ స్టోరీ వినిపిస్తాడా? లేదా? అన్నది పక్కన బెడితే అనీల్ సక్సెస్ ట్రాక్ చూసైనా స్పందించాలి.
అది జరిగిన మరుక్షణం స్టోరీ సెట్ అవ్వడం పెద్ద పనేం కాదు. అనీల్ నెల రోజులు వైజాగ్ పార్క్ హోటల్ లో సిట్టింగ్ వేసాడంటే? స్టోరీ సిద్దమైపోతుంది. నాగార్జున కూడా ఎంటర్ టైనింగ్ కథల్లో నటించడానికి ఆసక్తి చూపి స్తారు. సీరియస్ యాక్షన్ థ్రిల్లర్లు కంటే నాగ్ కి కలిసొచ్చినవి కూడా ఆ జానర్ కథలే. అలాంటి కథలు రాయడం అనీల్ కి కొట్టిన పిండే. వాటి కోసం అనీల్ ప్రత్యేక కసరత్తులు చేయాల్సిన పనేం లేదు. పార్క్ హోటల్ బీచ్ ముందు చైర్ ఏసుకుని కూర్చోవడమే ఆలస్యం. కప్ ఆఫ్ కాఫీ లా స్టోరీ రెడీ అయిపోతుంది.
