Begin typing your search above and press return to search.

M.S.G ప్రమోషన్స్.. అనిల్ రావిపూడి ప్లాన్స్ ఏంటి..?

ఎంత పెద్ద బడ్జెట్ సినిమా అయినా సరే.. ఎంత పెద్ద స్టార్ అందులో హీరో అయినా సరే సినిమా రిలీజ్ టైం లో సరైన ప్రమోషన్స్ లేకపోతే ప్రేక్షకులు పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు.

By:  Ramesh Boddu   |   10 Dec 2025 3:00 PM IST
M.S.G  ప్రమోషన్స్..  అనిల్ రావిపూడి ప్లాన్స్ ఏంటి..?
X

ఎంత పెద్ద బడ్జెట్ సినిమా అయినా సరే.. ఎంత పెద్ద స్టార్ అందులో హీరో అయినా సరే సినిమా రిలీజ్ టైం లో సరైన ప్రమోషన్స్ లేకపోతే ప్రేక్షకులు పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఐతే టాలీవుడ్ లో సినిమా తీయడమే కాదు ఆ సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో కూడా తెలిసిన దర్శకుల్లో ఒకరు అనిల్ రావిపూడి. ఆయన సినిమా వస్తుంది అంటే చూసేయాలి అనే రేంజ్ లో ప్రమోషన్స్ ఉంటాయి. అలా ఆయన ప్లాన్ చేస్తారు. ఐతే నెక్స్ట్ సంక్రాంతికి అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారు సినిమా వస్తుంది. మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.

అనిల్ సినిమా అంటే డిఫరెంట్ గా ప్రమోషన్స్..

ఐతే అనిల్ సినిమా అంటే ప్రమోషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఈ ప్రమోషన్స్ చూసే సినిమా చూసేయాలి అనే రేంజ్ లో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తాడు అనిల్ రావిపూడి. మరి M.S.G విషయంలో ఈ ప్లాన్స్ ఎలా ఉన్నాయన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈసారి సంక్రాంతికి రెండు మూడు కాదు ఐదు సినిమాల దాకా రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల మధ్య ఫైట్ రసవత్తరంగా ఉండబోతుంది.

అనిల్ రావిపూడి అది కూడా సంక్రాంతికి రిలీజ్ సినిమా కాబట్టి సినిమా పక్కా ఎంటర్టైన్ చేస్తుంది. ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ లో అనిల్ ప్లాన్ నెక్స్ట్ లెవెల్ ఉందట. సినిమా ప్రమోషన్స్ లో చిరంజీవితో పాటు నయనతారని కూడా ఇన్వాల్వ్ చేసే ప్లాన్ ఉందట. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార సినిమాల్లో నటించడమే కానీ కనీసం ఆమె ఏ మూవీ ఈవెంట్ కి అటెండ్ అవ్వదు. కానీ మన శంకర వరప్రసాద్ సినిమా కోసం మాత్రం నయనతారకి ముందే ప్రమోషన్స్ కండీషన్స్ పెట్టిన తర్వాతే ఆమెను తీసుకున్నారట.

మెగా ఫ్యాన్స్ ని మెప్పించేలా..

ఇక మెగా ఫ్యాన్స్ ని మెప్పించేలా రకరకాల ప్రమోషనల్ ప్లానింగ్స్ అనిల్ చేస్తున్నారట. ముఖ్యంగా వింటేజ్ చిరుని గుర్తు చేసేలా మెగా ఫ్యాన్స్ అందరు మళ్లీ ఆ చిరంజీవిని తలచుకునేలా చేస్తారట. మన శంకర వరప్రసాద్ సాంగ్స్, టీజర్ అన్నీ సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచగా తప్పకుండా ఈ సంక్రాంతికి మెగా బాస్ మెగా ఎంటర్టైనర్ తో అదరగొట్టబోతున్నాడని తెలుస్తుంది.

చిరంజీవి కూడా అనిల్ ప్రమోషనల్ ప్లానింగ్ తో సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారని తెలుస్తుంది. అనిల్ రావిపూడి చిరంజీవి నయనతార సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ మీద చేయాలని ఫిక్స్ అయ్యారట. క్రిస్మస్ నుంచే M.S.G ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ సంక్రాంతికి సెన్సేషనల్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ రాబోతున్న మన శంకర వరప్రసాద్ సినిమాతో కూడా భారీ టార్గెట్ పెట్టుకున్నారని తెలుస్తుంది.