ఏదైనా అడిగే దాన్ని బట్టే ఉంటుందంటున్న డైరెక్టర్
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పటాస్ మూవీతో కెరీర్ ను స్టార్ట్ చేసిన అనిల్, ఆ తర్వాత రవితేజ, వెంకటేష్, మహేష్ బాబు, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఒకదాన్ని మించి ఒకటి హిట్ అందుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 8 Dec 2025 11:22 AM ISTవినే టైమూ, చెప్పే మనిషిని వల్ల విషయం విలువే మారిపోతుందని ఓ సినిమాలో డైలాగు చెప్పినట్టు ఏ విషయాన్నైనా అడిగే దానిలోనే ఉంటుందని, మనం అడిగే విధానాన్ని బట్టే ఎదుటి వ్యక్తి నుంచి సమాధానమొస్తుందని చెప్తున్నారు టాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. కెరీర్ స్టార్టింగ్ నుంచి అనిల్ కు ఉన్న ట్రాక్ రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
స్టార్ హీరోలతో సినిమాలు చేసిన అనిల్
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పటాస్ మూవీతో కెరీర్ ను స్టార్ట్ చేసిన అనిల్, ఆ తర్వాత రవితేజ, వెంకటేష్, మహేష్ బాబు, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఒకదాన్ని మించి ఒకటి హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమాను లైన్ లో పెట్టి ఆ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రమోషన్స్ లో అనిల్ రూటే సపరేటు
మన శంకరవరప్రసాద్ గారు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతారను హీరోయిన్ గా ఎంపిక చేసి అందరికీ షాకిచ్చిన అనిల్, తన సినిమాలకు ప్రమోషన్స్ ఏ రేంజ్ లో చేస్తారో తెలిసిందే. కానీ నయనతార అంటే ప్రమోషన్స్ కు చాలా దూరంగా ఉంటారు. అలాంటి ఆమెను కూడా అనిల్ ఈ సినిమా ప్రమోషన్స్ కు ఒప్పించడంతో అసలు అనిల్, ఆమెకు ఏం చెప్పి ఒప్పించారనే అనుమానాలు అందరికీ కలిగాయి.
ఇదే విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో భాగంగా అనిల్ ను అడగ్గా నయనతార ప్రమోషన్స్ కు ఒప్పుకోవడానికి పెద్ద కారణమేమీ లేదని, తాను చాలా పాజిటివ్ గా, హానెస్ట్ గా వెళ్లి తనకు సినిమా కాన్సెప్ట్ ను చెప్పానని, ఇలా చేద్దామని చెప్పగానే ఆవిడ ఒప్పుకున్నారని, అంతే తప్పించి నయనతారను ఒప్పించడానికి తాను ప్రత్యేకంగా చేసిందేమీ లేదని, అందుకే ఏదైనా అడిగే విధానంలోనే ఉంటుందేమోనని అనిల్ అన్నారు.
