Begin typing your search above and press return to search.

రావిపూడి బ్రాండు పని చేస్తోంది

అనిల్ రావిపూడి సినిమాలకు క్రిటిక్స్ నుంచి గొప్ప రేటింగ్స్ ఏమీ పడవు. టాక్ కూడా ఆహా ఓహో అన్నట్లుండదు.

By:  Garuda Media   |   13 Feb 2026 8:42 PM IST
రావిపూడి బ్రాండు పని చేస్తోంది
X

అనిల్ రావిపూడి సినిమాలకు క్రిటిక్స్ నుంచి గొప్ప రేటింగ్స్ ఏమీ పడవు. టాక్ కూడా ఆహా ఓహో అన్నట్లుండదు. కానీ చివరికి చూస్తే తన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుంటాయి. గత ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’, ఈ ఏడాది పండక్కి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాల విషయంలో ఇదే జరిగింది. మామూలు ఫ్యామిలీ ఎంటర్టైనర్లతోనే వసూళ్ల మోత మోగించాడు అనిల్.

ఐతే మూడు రోజుల ముందు ‘మన శంకర వరప్రసాద్ గారు’ జీ5 ద్వారా ఓటీటీలోకి వచ్చింది. ఆ సందర్భంగా పెద్దగా హడావుడి కనిపించలేదు. ‘రాజాసాబ్’ రిలీజైనపుడు హాట్ స్టార్ వాళ్లు పబ్లిసిటీ మామూలుగా చేయలేదు. సోషల్ మీడియాలో కూడా కొన్ని రోజుల పాటు ఆ సినిమా డిస్కషన్లే కనిపించాయి. కానీ జీ5 పెద్దగా హడావుడి చేయకుండా సినిమాను స్ట్రీమింగ్‌కు తెచ్చేసింది. సోషల్ మీడియాలో పెద్దగా డిస్కషన్ లేదు. కానీ ఈ సినిమాకు వ్యూయర్‌షిప్ మాత్రం మామూలుగా లేదు.

కేవలం 24 గంటల వ్యవధిలో 200 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో సంచలనం రేపింది ‘మన శంకర వరప్రసాద్ గారు’. జీ5లో ప్రాంతీయ చిత్రాల్లో ఇంత వేగంగా ఈ మార్కును అందుకున్న సినిమా ఇంకోటి లేదట. ఇదంతా అనిల్ రావిపూడి బ్రాండు మహిమ అని వేరే చెప్పాల్సిన పని లేదు. మెగాస్టార్ చరిష్మా, ఫాలోయింగ్ కూడా పెద్ద ప్లస్సే అయినప్పటికీ.. అనిల్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న తిరుగులేని ఫాలోయింగ్ ఈ చిత్రానికి ఈ స్థాయిలో వ్యూయర్‌షిప్ రావడానికి ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు.

గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని థియేటర్లలో విరగబడి చూసినప్పటికీ.. అది ఓటీటీలోకి వచ్చినపుడు కూడా అంతే రెస్పాన్స్ వచ్చింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ విషయంలోనూ అదే జరుగుతోంది. దీంతో అనిల్ మీద మార్కెట్ వర్గాల్లో మరింత నమ్మకం పెరిగి.. తన కొత్త సినిమాకు బిజినెస్ ఒక రేంజిలో జరిగేలా కనిపిస్తోంది. వెంకటేష్‌తో అనిల్ చేయబోయే సినిమా వివరాలను త్వరలోనే ప్రకటించబోతున్నారు.