అనిల్ స్పీడు చూసి ఆశ్చర్యపోవాల్సిందే!
ఇక అసలు విషయానికొస్తే తెలుగు సినిమా స్థాయి విపరీతంగా పెరిగిన నేపథ్యంలో స్టార్ హీరోలు చేసే ప్రతీ సినిమాకీ ఎంతో టైమ్ పడుతూ వస్తుంది.
By: Sravani Lakshmi Srungarapu | 3 Nov 2025 2:02 PM ISTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మన శంకరవరప్రసాద్ గారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. చిరూ టైమింగ్ కు అనిల్ రావిపూడి రైటింగ్, దానికి వెంకటేష్ కూడా తోడైతే ఆ కాంబినేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
వేగంగా సినిమాలను పూర్తి చేసే అనిల్ రావిపూడి
ఇక అసలు విషయానికొస్తే తెలుగు సినిమా స్థాయి విపరీతంగా పెరిగిన నేపథ్యంలో స్టార్ హీరోలు చేసే ప్రతీ సినిమాకీ ఎంతో టైమ్ పడుతూ వస్తుంది. ఏళ్లకు ఏళ్లు సినిమాలు సెట్స్ లోనే ఉంటున్నాయి. కానీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసే ఏ హీరో అయినా సరే తన సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసే వెసులుబాటు ఉంటుంది. సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడమే ఆలస్యం ఎంతో వేగంగా సినిమాలను పూర్తి చేస్తారు అనిల్ రావిపూడి.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మన శంకరవరప్రసాద్ గారు
ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారు సినిమాను కూడా అనిల్ అంతే వేగంగా పూర్తి చేస్తున్నారు. ఉగాదికి పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అందులో భాగంగానే ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తైనట్టు సమాచారం. మన శంకరవరప్రసాద్ గారు సినిమా షూటింగ్ కు సంబంధించి ఇప్పుడో అప్డేట్ తెలుస్తోంది.
చిరూ, వెంకీపై స్పెషల్ సాంగ్
మరో రెండు పాటలు, రెండు ఫైట్స్ సీక్వెన్స్ లు మినహా మన శంకరవరప్రసాద్ గారు షూటింగ్ మొత్తం పూర్తైందని తెలుస్తోంది. ఆ రెండు సాంగ్స్ లో ఓ సాంగ్ చిరంజీవి, వెంకటేష్ పై తెరకెక్కనున్నారు. చూస్తుంటే అనిల్ బ్యాలెన్స్ షూటింగ్ ను కూడా చాలా త్వరలోనే పూర్తి చేసి ఆ తర్వాత ప్రమోషన్స్ పై ఫుల్ ఫోకస్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అనిల్ స్పీడు చూసి అందరూ ఆశ్చర్యపోతూ ముక్కున వేలేసుకుంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే.
