Begin typing your search above and press return to search.

మ‌ల్టీస్టార‌ర్ స్టోరీ 60 రోజుల్లోనే!

హిట్ మెషిన్ అనీల్ రావిపూడి స్టోరీ రాయడానికి , షూటింగ్ పూర్తి చేయ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం తీసుకోడు. మ‌హా అయితే క‌థ రాయ‌డానికి నెల రోజుల స‌మ‌యం ఎక్కువ అంటాడు ఆయ‌న‌.

By:  Srikanth Kontham   |   9 March 2026 1:06 PM IST
మ‌ల్టీస్టార‌ర్ స్టోరీ 60 రోజుల్లోనే!
X

హిట్ మెషిన్ అనీల్ రావిపూడి స్టోరీ రాయడానికి , షూటింగ్ పూర్తి చేయ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం తీసుకోడు. మ‌హా అయితే క‌థ రాయ‌డానికి నెల రోజుల స‌మ‌యం ఎక్కువ అంటాడు ఆయ‌న‌. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న తీసిన సినిమా క‌థ‌ల‌న్నీ నెల నుంచి 45 రోజుల మ‌ధ్య‌లో పూర్తి చేసిన‌వే. ఏ సినిమా కోసం అంత‌కు మించి స‌మ‌యం తీసుకోలేదు. కానీ త్వ‌ర‌లో ప‌ట్టాలెక్కించే మల్టీస్టార‌ర్ కోసం మాత్రం ఏకంగా రెండు నెల‌లు స‌మ‌యం తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించాడు. విక్ట‌రీ వెంకటేష్-క‌ళ్యాణ్ హీరోల‌గా ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

తొలుత వెంక‌టేష్ హీరోగా సోలో చిత్రాన్ని తెర‌కెక్కిస్తాడ‌ని ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు దీన్ని మ‌ల్టీస్టార‌ర్ గా మార్చాడు అనీల్. ఇక్క‌డో బ‌ల‌మైన కార‌ణంగా ఉంది. `ప‌టాస్` త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్ తో అనీల్ సినిమా చేయ‌లేదు. `ప‌టాస్` అన్న‌ది ద‌ర్శ‌కుడిగా అనీల్ కి తొలి చిత్రం. ఆ సినిమాతోనే అనీల్ ట్యాలెంట్ బ‌య‌ట‌కొచ్చింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా హిట్లు అందుకుని స్టార్ డైరెక్ట‌ర్ అయ్యాడు. కానీ `ప‌టాస్` త‌ర్వాత మ‌ళ్లీ క‌ళ్యాణ్ రామ్ తో సినిమా చేయ‌లేదు. `పటాస్` కు సీక్వెల్గ ఆ `ప‌టాస్ 2` చేస్తాడనే ప్ర‌చారం జ‌రిగింది కానీ ఇంత వ‌ర‌కూ అది సాధ్య‌ప‌డ‌లేదు.

దీంతో క‌ళ్యాణ్ రామ్ తో సినిమా చేయ‌డం కూడా డిలే అవుతుంది. ఈ నేప‌థ్యంలో వెంకీతో అనుకున్న సోలో ప్రాజెక్ట్ ను క‌ళ్యాణ్ రామ్ ను యాడ్ చేసి మ‌ల్టీస్టార‌ర్ గా మార్చాడు. క‌ళ్యాణ్ రామ్ కు `బింబిసార` త‌ర్వాత స‌రైన హిట్లు ప‌డ‌లేదు. దీంతో ఆయ‌న మార్కెట్ కూడా డౌన్ ఫాల్ లో ప‌డింది. అలాంటి స్టార్ ని ఆదుకోక‌పోతే ఎలా అనీల్ సంక‌ల్పించి ముందుకొచ్చాడు. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి మొద‌లు పెడ‌తాన‌ని అనీల్ తెలిపాడు. అలాగే న‌వంబ‌ర్ క‌ల్లా షూట్ మొత్తం పూర్తి చేస్తాన‌న‌న్నాడు. అనంత‌రం పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నుల‌కు మ‌రో నెల రోజుల స‌మ‌యం తీసుకుంటాడు.

అటుపై సంక్రాంతి కానుక‌గా చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామ‌ని మ‌రోసారి వెల్ల‌డించాడు. ప్ర‌స్తుతం వెంక‌టేష్‌ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆద‌ర్శ కుటుంబం హౌస్ నెంబ‌ర్ 47` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. క‌ళ్యాణ్ రామ్ మాత్రం `అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి` త‌ర్వాత ఎలాంటి సినిమాకు క‌మిట్ అవ్వ‌లేదు. వ‌రుస ప‌రా జ‌యాల నేప‌థ్యంలో హిట్ సినిమా మాత్ర‌మే చేయాల‌ని క‌సిగా ఉన్నాడు. ఈ క్ర‌మంలో అనీల్ తో మ‌రోసారి ప‌ని చేసే అవ‌కాశం ల‌భించింది.