బీటెక్ లో 3సబ్జెక్టులు ఫెయిలైన హిట్ మెషిన్!
అనీల్ రావిపూడి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు.
By: Srikanth Kontham | 26 Jan 2026 5:40 PM ISTఅనీల్ రావిపూడి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. అసిస్టెంట్ రైటర్ గా, డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగాడు. అనీల్ కు `తమ్ముడు` సినిమా డైరెక్టర్ పి.ఏ అరుణ్ ప్రసాద్ స్వయానా బాబాయ్ అవుతారు. `తమ్ముడు` చిత్రాన్ని పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించి అప్పట్లోనే పీకే కి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. పవన్ హీరోగా ఎదుగుతోన్న రోజుల్లో `తమ్ముడు` విజయం పవన్ కొత్త ఇమేజ్ ని తెచ్చి పెట్టింది. అలా మెగా ఫ్యామిలీతో అనీల్ రావిపూడి ఫ్యామిలీ బాండింగ్ ఆరోజుల్లోనే ఏర్పడింది. `మన శంకర వరప్రసాద్ గారు` తో మెగాస్టార్ చిరంజీవికి అనీల్ బ్లాక్ బస్టర్ ఇచ్చి సంచలనమయ్యాడు.
ఈ సినిమా సక్సెస్ మీట్ లో అనీల్ రావిపూడి తండ్రి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే అనీల్ కు సంబంధించిన ఓఇంట్రెస్టింగ్ విషయం బయటకువ చ్చింది. అనీల్ రావిపూడి బీటెక్ పూర్తిచేసి సినిమాల్లోకి వచ్చాడని అందరికీ తెలుసు. కానీ ఆ బీటెక్ పూర్తి చేయడానికి పరోక్ష కారుకుడు చిరంజీవి అని తెలుస్తోంది. అనీల్ బీటెక్ థర్డ్ ఇయర్ లో మూడు సబ్జెక్టులు ఫెయిలయ్యాడు. స్నేహితుడితో కలిసి ముసుగేసి సినిమాల గురించి మాట్లాడేవాడు. సినిమాల మీద పిచ్చితో? అందులోనూ చిరంజీవి సినిమాలు వారానికి మూడు చూడటం అలవాటు.
అలా చిరంజీవి సినిమాలు చూసి ఫెయిలైతే చిరంజీవికి చెడ్డ పేరు అని తండ్రి హిత బోధ చేయడంతో? చిరంజీవి మీద అభిమానంతో ఫెయిలైన మూడు సబ్జెక్ట్ లు తర్వాత పాస్ అయ్యాడు. అలా అనీల్ రావిపూడి ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. అనంతరం మరో ఆలోచన లేకుండా ఎర్రబస్సెక్కి ఇండస్ట్రీకి వచ్చాడు. అక్కడ తెలిసిన వారు ఎవరైనా ఉన్నారు? అంటే అది బాబాయ్ అరుణ్ ప్రసాద్. `తమ్ముడు` తర్వాత తమిళంలో విజయ్ హీరోగా `బద్రీ`ని రీమేక్ చేసాడు. అలాగే కన్నడలో సుదీప్ హీరోగా `చందు` అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.
అనంతరం నవదీప్ తో `గౌతమ్ ఎస్ ఎస్ సీ` చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా సమయంలో అనీల్ రావిపూడి ఇండస్ట్రీకి వచ్చి నేరుగా ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరిపోయాడు. అలా మొదలైన అనీల్ ప్రయాణం నేటి స్టార్ డైరక్టర్ వరకూ దారి తీసింది. అనీల్ దర్శకుడు అవ్వకముందు `శౌర్యం`, `శంఖం`, `కందిరీగ`, `ఆగడు` వంటి సినిమాలకు డైలాగ్ రైటర్‌గా, స్క్రిప్ట్ వర్క్‌లోనూ పని చేశారు.
