రావిపూడి లీక్స్: మైత్రీ రవి, నవీన్ మధ్య డిఫరెన్స్ ఇదేనా?
సినిమా బాగా వచ్చిందని సంతోషించడంతో ఆగకుండా.. ఇంకా ఏం చేయొచ్చు? ఎలా ఉండొచ్చు? అనే విషయాలపై సలహాలు ఇస్తుంటారని తెలిపారు.
By: M Prashanth | 11 Sept 2026 12:42 PM ISTఒక సినిమా హిట్ అయితే కొందరికి కథ గుర్తొస్తుంది.. ఇంకొందరికి హీరో గుర్తొస్తాడు.. కానీ నిర్మాతలకు మాత్రం ముందుగా గుర్తొచ్చేది కలెక్షన్స్! అయితే మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో మాత్రం ఆ లెక్క కూడా ఇద్దరికి ఇద్దరుగా ఉంటుందట. ఒకరికి సినిమా సక్సెస్ తర్వాత క్రియేటివ్ లెక్కలు మొదలైతే.. మరొకరికి బాక్సాఫీస్ లెక్కలు మొదలవుతాయట. ఆ ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ ను స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రీసెంట్ గా లీక్ చేశారు.
మాస్ మహారాజా రవితేజ లీడ్ రోల్ లో నటించింన ఇరుముడి మూవీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన రావిపూడి.. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు, నిర్మాతలు వై. రవిశంకర్, నవీన్ యెర్నేని గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రవిశంకర్ తమ సినిమా సక్సెస్ అయిన తర్వాత తనలోని క్రియేటివ్ వ్యక్తిని బయటకు తీస్తారని అనిల్ రావిపూడి చెప్పారు.
సినిమా బాగా వచ్చిందని సంతోషించడంతో ఆగకుండా.. ఇంకా ఏం చేయొచ్చు? ఎలా ఉండొచ్చు? అనే విషయాలపై సలహాలు ఇస్తుంటారని తెలిపారు. అంటే సినిమా సక్సెస్ అయినా ఆయన ఆలోచన మళ్లీ మూవీ చుట్టూనే తిరుగుతుందన్నమాట. కానీ నవీన్ యెర్నేని మాత్రం అలా కాదట. ఆయనకు సినిమా హిట్ అయిందంటే బాక్సాఫీస్ లెక్కలే గుర్తొస్తాయట.
'అబ్బాయి.. సీడెడ్ ఇంత.. నైజాం ఇంత' అంటూ ఏరియాల వారీగా కలెక్షన్స్ చెబుతుంటారని రావిపూడి సరదాగా చెప్పారు. నవీన్ నుంచి కలెక్షన్స్ గురించి కాల్స్ వస్తుంటాయని తెలిపారు. అంటే ఇద్దరూ ఒకే సంస్థను నడుపుతున్నా.. సినిమా సక్సెస్ ను చూసే యాంగిల్ మాత్రం వేరన్నమాట. రవిశంకర్ ది క్రియేటివ్ లుక్ అయితే.. నవీన్ ది కంప్లీట్ బాక్సాఫీస్ లుక్ అన్నట్టుగా రావిపూడి చెప్పుకొచ్చారు. అయితే ఇద్దరూ అలా ఉండడమే కరెక్ట్ అని నెటిజన్లు అంటున్నారు.
ఇక మైత్రీ మూవీ మేకర్స్ కు భారీ విజయాలు కొత్తేమీ కాదు. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న చిత్రాల వరకు ఆ బ్యానర్ వరుస విజయాలతో తనదైన క్రేజ్ సంపాదించుకుంది. అలాంటి సక్సెస్ ల వెనుక నిర్మాతలుగా ఇద్దరి ఆలోచనా విధానాలు కూడా ముఖ్యమే. అయితే బయటకు చూస్తే ఇద్దరూ నిర్మాతలే అయినా.. సినిమా సక్సెస్ ను ఫీల్ అయ్యే విధానం మాత్రం డిఫరెంట్ గా ఉంటుందా అంటూ ఇప్పుడు ఆ కామెంట్స్ పై చర్చ జరుగుతోంది.
ఇక అనిల్ రావిపూడి- మైత్రీ కాంబినేషన్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇప్పటివరకు వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. గతంలో రావిపూడి సినిమాలతో మైత్రీకి రిలేషన్ ఉన్నప్పటికీ.. దర్శకుడిగా ఆ బ్యానర్ తో ఆయన సినిమా చేయలేదు. ఫ్యూచర్ లో ఆ కాంబో సెట్ అయితే మాత్రం.. రవి శంకర్ క్రియేటివ్ లెక్కలు, నవీన్ బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉంటాయో వేచి చూడాలి మరి. అయితే రావిపూడి- మైత్రీ కాంబోలో సినిమా కోసం ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
