ఫ్లాప్ హీరోయిన్స్ ని పట్టుకున్న అనిల్ రావుపూడి.. ఫేట్ మార్చేనా?
టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం ఒక క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టారు.
By: Madhu Reddy | 27 March 2026 1:00 AM ISTటాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం ఒక క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టారు. వెంకటేష్, కల్యాణ్ రామ్ హీరోలుగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం అనిల్ ఎంచుకుంటున్న హీరోయిన్ల పేర్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఫామ్‌లో లేని హీరోయిన్లను తన సినిమాలోకి తీసుకోవడం ద్వారా వారికి మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కించాలని అనిల్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ 'హిట్ మెషీన్' చేతిలో పడ్డాక ఆ ముద్దుగుమ్మల జాతకాలు మారతాయో లేదో చూడాలి.
వెంకీ సరసన 'మహానటి'.. క్రేజీ కాంబో!:
ఈ మల్టీస్టారర్ సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన హీరోయిన్‌గా కీర్తి సురేష్ పేరు బలంగా వినిపిస్తోంది. వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు, కాబట్టి ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు చాలా కొత్తగా ఉంటుందని అనిల్ రావిపూడి భావిస్తున్నారు. నిజానికి కీర్తి సురేష్‌కు ఈ మధ్య కాలంలో సరైన హిట్లు లేవు. ఇటీవల వచ్చిన 'ఉప్పుకప్పురంబు', 'రివాల్వర్ రీటా' వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇలాంటి టైమ్‌లో అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ రావడం కీర్తి కెరీర్‌కు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కల్యాణ్ రామ్ జోడీ ఎవరు? కృతీనా.. కయాదునా?:
ఇక మరోవైపు ఇదే సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్ సరసన నటించే హీరోయిన్ కోసం ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నారట. ఒకరు 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి కాగా, మరొకరు కయాదు లోహర్. కృతి శెట్టి కెరీర్ మొదట్లో వరుస హిట్లు అందుకున్నప్పటికీ, ఈ మధ్య కాలంలో ఆమెకు ఒక్క సాలిడ్ హిట్ కూడా తగలలేదు. అటు కయాదు లోహర్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉంది. వీరిద్దరిలో అనిల్ ఎవరిని ఫైనల్ చేసినా, వారికి ఒక అదిరిపోయే కమ్‌బ్యాక్ మూవీ దొరికినట్టేనని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే మీనాక్షి చౌదరి లాంటి హీరోయిన్ కి తన సినిమాల ద్వారా మంచి సక్సెస్ను అందించారు. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలలో అవకాశానందుకుంటూ దూసుకు పోతోంది. ఇక ఇప్పుడు మళ్లీ అనిల్ రావిపూడి కొత్త సినిమాలో ఈ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. కాబట్టి వీరి ఫేట్ మారుతుంది అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి
అనిల్ రావిపూడి అంటేనే 'హిట్' గ్యారెంటీ:
ఇకపోతే అనిల్ రావిపూడి సినిమాలంటేనే మినిమం గ్యారెంటీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. పటాస్ నుండి మన శంకర వర ప్రసాద్ వరకు ఆయన ప్లాప్ ఎరగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్లను చాలా ఎనర్జిటిక్‌గా, బబ్లీగా చూపించడంలో అనిల్ స్టైలే వేరు. అందుకే హిట్ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్న హీరోయిన్లకు అనిల్ సినిమా ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఈ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేస్తే, సక్సెస్ ఆటోమేటిక్‌గా వారి ఖాతాలో పడిపోతుందని టాలీవుడ్‌లో ఒక గట్టి నమ్మకం ఉంది.
2027 సంక్రాంతికి అసలు మజా:
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హీరోయిన్ల విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నా, లీక్ అవుతున్న పేర్లు మాత్రం అంచనాలను పెంచేస్తున్నాయి. 2027 సంక్రాంతి రేసులో నిలవనున్న ఈ మూవీతో వెంకీ, కల్యాణ్ రామ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. ఫామ్‌లో లేని హీరోయిన్ల ఫేట్ మార్చడంలో అనిల్ రావిపూడి మరోసారి సక్సెస్ అవుతారని అభిమానులు ఆశిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
