హిట్ మెషిన్ తో పని చేసినా కలిసి రాలేదు!
సినిమా హిట్ అయిందంటే? అందులో నటించిన హీరోయిన్లకు మంచి అవకాశాలు వస్తాయి. ట్యాలెంట్ ఉన్నా? లేకపోయినా సక్సెస్ సెంటిమెంట్ తోనైనా అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉంటుంది.
By: Srikanth Kontham | 23 Jan 2026 9:28 AM ISTసినిమా హిట్ అయిందంటే? అందులో నటించిన హీరోయిన్లకు మంచి అవకాశాలు వస్తాయి. ట్యాలెంట్ ఉన్నా? లేకపోయినా సక్సెస్ సెంటిమెంట్ తోనైనా అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉంటుంది. భవిష్యత్ కాలంలో బిజీ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ హిట్ మెషిన్ అనీల్ రావిపూడి సినిమాల్లో భాగమైన హీరోయిన్లు ఇంకెంత బిజీగా ఉంటారు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. వందల కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయంటే? అందులో హీరోయిన్లు క్షణం తీరిక లేకుండా గడుతారు అనుకుంటాం. కానీ ఇక్కడ రియాల్టీ వేరేలా ఉంది.
ఓ సారి ఆ వివరాల్లోకి వెళ్తే.. అనీల్ తొలి సినిమా `పటాస్` తో శ్రుతి శోధీ హీరోయిన్ గా పరిచయమైంది. అమ్మడు అందం, అభినయం గల నాయికే. కానీ ఆ విజయం తర్వాత శ్రుతికి అవకాశాలే రాలేదు. ఓ సినిమాలో స్పెషల్ సాంగ్..మరో సినిమా లో హీరోయిన్ గా నటించిన మాయమైపోయింది. అనీల్ డెరెక్ట్ చేసిన `సుప్రీమ్` లో రాశీఖన్నా నటించింది. ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. రాశీ అప్పటికే పరాజయాల్లో ఉంది. కాబట్టి రాశీఖన్నా విషయంలో అనీల్ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేదు. అమ్మడు కెరీర్ ఆరంభం నుంచి కూడా ట్యాలెంట్ కంటే? అదృష్టంతోనే అవకాశాలు అందుకుంటోంది అన్నది కాదనలేని నిజం.
`రాజా ది గ్రేట్` తర్వాత మెహరీన్ చాలా తెలుగు సినిమాలు చేసింది. కానీ అనీల్ సినిమాలతో వచ్చిన గుర్తింపు మరే సినిమాతో రాలేదు. చివరిగా `ఎఫ్ 2`, `ఎఫ్ 3` లో నటించి తెలుగు సినిమాల నుంచి అదృశ్యమైపోయింది. రెండేళ్లగా తమిళ, కన్నడ భాషల్లోనే క నిపిస్తోంది. `సరిలేరు నీకెవ్వరు`లో రష్మికా మందన్నా నటించింది. ఈ బ్యూటీ అప్పటికే ఫేమస్ అయింది. అనీల్ అందించే సక్సస్ తో ఆమెకు పనిలేదు. తన ట్యాలెంట్ తోనే అప్పటికే బిజీగా ఉంది.
అలాగే `భగవంత్ కేసరి` బ్లాక్ బస్టర్ అయింది. అందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది. కానీ ఈ విజయం కాలజ్ కి ఏ రకంగానే వర్కౌట్ అవ్వలేదు. కొత్త అవకాశాలు అందుకోవడంలో వెనుకబడింది. అయితే అప్పటికే కాజల్ టాలీవుడ్ లో సక్సస్ ను పీక్స్ లో చూసేసింది. దీంతో మేకర్స్ కూడా ఆమెను లైట్ తీసుకున్నారు.
అదే సినిమాలో ఓ ముఖ్య పాత్రలో శ్రీలీల అలరించింది. కానీ ఆ గుర్తింపుతో శ్రీలీల హీరోయిన్ గా గొప్ప అవకాశాలైతే అందుకలేదు. అనీల్ నుంచి బ్లాక్ బస్టర్ అయిన మరో చిత్రం `సంక్రాంతికి వస్తున్నాం`.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల వసూళ్లనే సాధించింది. ఇందులో హీరోయిన్లగా ఐశ్వర్యారాజేష్, మీనాక్షి చౌదరి నటించారు. మరి ఈ విజయంతో వారిద్దరు హీరోయిన్లగా బిజీ అయ్యారంటే? లేదనే చెప్పాలి. తాజాగా రిలీజ్ అయిన `మన శంకర వరప్రసాద్ గారు` లో నయనతార నటించిన సంగతి తెలిసిందే. సినిమా మంచి విజయం సాధించింది. కానీ ఈ సక్సెస్ తో లేడీ సూపర్ స్టార్ కి పనిలేదు. తానెప్పుడు సౌత్ లో బిజీ హీరోయినే.
