Begin typing your search above and press return to search.

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

వెంకటేశ్, కల్యాణ్ రామ్ నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’ ప్రమోషన్లలో అనిల్ రావిపూడి సందడి చేస్తున్నారు. ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ కోసం కృతి శెట్టితో కలిసి ‘దళపతి’ సినిమాలోని పాపులర్ సీన్‌ను రీక్రియేట్ చేశారు. నవంబర్ 20 నుంచి పాటల ప్రచారం మొదలుకానుండగా, డిసెంబర్ చివర్లో అమెరికాలోనూ ప్రమోషన్లు నిర్వహించనున్నారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   19 Nov 2026 3:25 PM IST
కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!
X

ప్రమోషన్స్ అంతే చాలు అనిల్ రావిపూడి ముందుంటారు. సంక్రాంతి సినిమాల సందడి మొదలవ్వడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం అప్పుడే ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టేశారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా ఆయన తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'జనవరి 12 విడుదల'. ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా విడుదలకు ముందే అనిల్ రావిపూడి తనదైన స్టైల్‌లో ప్రమోషన్స్‌తో సందడి చేస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అనిల్ రావిపూడి చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన క్లాసిక్ మూవీ దళపతిలోని ఓ పాపులర్ సీన్‌ను ఆయన రీక్రియేట్ చేశారు. ఇందులో హీరోయిన్ కృతి శెట్టి కూడా పాల్గొన్నారు. ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇవ్వడానికి ఈ సరదా వీడియోను రూపొందించారు. ఈ వీడియోలో అనిల్ రావిపూడి, కృతి శెట్టి చేసిన సందడి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

అయితే ఈ ప్రమోషనల్ వీడియోలో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. సినిమా హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి ఇద్దరూ కలిసి కనిపిస్తూ సరదాగా మాట్లాడుకున్నారు. ప్రమోషన్స్ అంటే అనిల్ రావిపూడి ప్రతిచోటా వచ్చేస్తున్నారనే అర్థం వచ్చేలా ఫన్నీగా కామెంట్స్ చేశారు. అంతేకాదు, ఇది తమ గర్ల్స్ సాంగ్ అంటూ చిన్న స్టెప్‌తో సందడి చేశారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అనిల్ రావిపూడి సినిమా ప్రమోషన్స్‌లో కూడా కామెడీని వదలడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పుడే ఈ స్థాయిలో సందడి చేస్తుంటే, రిలీజ్ సమయానికి ఇంకెన్ని కార్యక్రమాలు ప్లాన్ చేస్తారో అని ఆసక్తి చూపిస్తున్నారు.

నవంబర్ 20 నుంచి ఈ సినిమా పాటల ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు డిసెంబర్ 26, 27 తేదీల్లో చికాగోలో, డిసెంబర్ 29 నుంచి 31 వరకు ఆస్టిన్, డల్లాస్ నగరాల్లో చిత్ర బృందం అమెరికా ప్రమోషనల్ టూర్ నిర్వహించనుంది.