Begin typing your search above and press return to search.

హిట్టు డైరెక్టర్ పై ఇదేం ర్యాగింగో..!

రాజమౌళి తర్వాత తీసిన ప్రతి సినిమా హిట్ అందుకుంటున్న ఈ డైరెక్టర్ కి అదేంటో నెగిటివిటీ కూడా అదే రేంజ్ లో పెరుగుతూ వస్తుంది.

By:  Ramesh Boddu   |   4 Oct 2025 12:11 PM IST
హిట్టు డైరెక్టర్ పై ఇదేం ర్యాగింగో..!
X

రాజమౌళి తర్వాత తీసిన ప్రతి సినిమా హిట్ అందుకుంటున్న ఈ డైరెక్టర్ కి డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అవుతుంది. అతను తీసే ఎంటర్టైనింగ్ సినిమాలు కొందరికి క్రింజ్ ఫీలింగ్ కలిగిస్తున్నా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాయి కాబట్టి అలానే కొనసాగిస్తున్నాడు. సక్సెస్ ఫుల్ సినిమాలతో అదరగొట్టేస్తున్న ఈ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమో రిలీజైంది. అందులో ఆ సాంగ్ కోసం అతను రిలీజ్ చేసిన వీడియో వచ్చింది. అంతే అతను ఏదైతే ఊహించాడో ఆ విషయంలో సక్సెస్ అయినా కొంతమంది నుంచి డిజప్పాయింట్ మాత్రం వెల్లడవుతుంది.

టార్గెటెడ్ ఆడియన్స్ ఫ్యామిలీస్..

ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు వరుస హిట్లు కొట్టిన డైరెక్టర్ అనిల్ రావిపూడిని కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అఫ్కోర్స్ అవన్నీ అతను పట్టించుకోడు కానీ అదేంటి అంటే అతను చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవుతున్నా అతని సినిమాల్లో కామెడీ ఆడియన్స్ లో కొందరికి నచ్చట్లేదు. అతను టార్గెటెడ్ ఆడియన్స్ ఫ్యామిలీస్ కాబట్టి వాళ్లకి నచ్చుతున్నాయి. సినిమాలు ఆడేస్తున్నాయి.

ఈ డైరెక్టర్ సినిమాలో మ్యాటర్ ఎలా ఉన్నా ప్రమోషన్స్ లో మ్యాటర్ ఒక రేంజ్ లో ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు విపరీతమైన ప్రమోషన్స్ చేసి ఆ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు చేస్తున్నాడు. ఆ సినిమా నుంచి లేటెస్ట్ గా ఒక సాంగ్ ప్రోమో వచ్చింది. 70 ఏళ్ల ఏజ్ లో చిరంజీవి గ్రేస్ కి సూపర్ అనేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఐతే ఆ సాంగ్ ప్రోమో కోసం అనిల్ ఉదిత్ నారాయణతో ఒక స్పెషల్ వీడియో చేశాడు. దానిపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కామెడీని అతను క్రింజ్ చేస్తున్నాడని..

సక్సెస్ లో ఉన్న డైరెక్టర్ అయినా సరే అతన్ని విమర్శించే వాళ్లు కూడా ఉంటారు. అసలు అనిల్ సక్సెస్ రేటు తెలిసి కూడా ఎలా అంటున్నారన్నది యాక్యువల్ పాయింట్. ఐతే కామెడీని అతను క్రింజ్ చేస్తున్నాడని కొందరి మాట. ఏం చేసినా ఎలా చేసినా ఆడియన్స్ ని నవ్విస్తున్నాడు.. నిర్మాతలకు లాభాలు తెస్తున్నాడు కాబట్టి అనిల్ ఏం చేసినా అది అదిరిపోతుందనే ఫైనల్ గా చెప్పాల్సిన మాట.

ఒకరి మీద ఒక కామెంట్ చేయడం చాలా తేలిక. ఆ ఫ్రీడం కూడా ఉంటుంది. కానీ అతని ప్రయత్నాలు ఎక్కువశాతం ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు కాబట్టే అదే రూట్ లో ఆయన సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్ తో అనిల్ రావిపూడి చేస్తున్న మన శంకర ప్రసాద్ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.