Begin typing your search above and press return to search.

అనిల్ రావిపూడి మ్యాజిక్.. టీవీలోనూ రికార్డు TRPలు సాధించిన సినిమాలు

ఈ సంఖ్యలు చూస్తే అనిల్ రావిపూడి సినిమాలు థియేటర్లలో మాత్రమే కాకుండా టెలివిజన్‌లో కూడా ఎంత పెద్ద విజయం సాధించాయో స్పష్టంగా తెలుస్తుంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   13 March 2026 11:38 AM IST
అనిల్ రావిపూడి మ్యాజిక్.. టీవీలోనూ రికార్డు TRPలు సాధించిన సినిమాలు
X

రాజమౌళి తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు అనిల్ రావిపూడి. ఈ క్రమంలో అనిల్ రావిపూడి క్రియేట్ చేసిన మరో రికార్డ్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల టెలివిజన్ TRP రేటింగ్స్‌కి సంబంధించిన వివరాలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సంఖ్యలు చూస్తే అనిల్ రావిపూడి సినిమాలు థియేటర్లలో మాత్రమే కాకుండా టెలివిజన్‌లో కూడా ఎంత పెద్ద విజయం సాధించాయో స్పష్టంగా తెలుస్తుంది.





అనిల్ రావిపూడి టాలీవుడ్‌లో కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. ఆయన తెరకెక్కించిన చాలా సినిమాలు ప్రేక్షకులను నవ్విస్తూ, కుటుంబంతో కలిసి చూడదగ్గ వినోదాన్ని అందిస్తాయి. అందుకే ఆయన సినిమాలు థియేటర్‌లో హిట్ అవడమే కాకుండా టీవీలో ప్రసారం అయినప్పుడు కూడా భారీ TRP రేటింగ్స్ సాధిస్తుంటాయి.

టిఆర్పీ వివరాల ప్రకారం సరిలేరు నీకెవ్వరు సినిమా 24.2 TRP రేటింగ్ సాధించి అత్యధిక రేటింగ్ అందుకుంది. అదే విధంగా ఎఫ్2 సినిమా 18.6 TRP, రాజా ది గ్రేట్ 18.4 TRP, సంక్రాంతికి వస్తున్నాం 18.3 TRP వంటి రేటింగ్స్‌తో మంచి స్పందన అందుకున్నాయి. అలాగే పటాస్, సుప్రీం, ఎఫ్3, భగవంత్ కేసరి, మహర్షి వంటి సినిమాలు కూడా మంచి TRP రేటింగ్స్ పొందాయి.

ఈ సంఖ్యలు చూస్తే అనిల్ రావిపూడి సినిమాలు ప్రతి వయస్సు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అర్థమవుతుంది. ఆయన సినిమాల్లో ఉండే సరదా కామెడీ, కుటుంబ భావోద్వేగాలు, సింపుల్ కథలు ప్రేక్షకులను దగ్గర చేస్తాయి. అందుకే ఆయన సినిమాలు మళ్లీ మళ్లీ చూసేలా ఉంటాయి.

అనిల్ రావిపూడి సినిమాల మరో ప్రత్యేకత ఏమిటంటే అవి థియేటర్‌లో చూసినా, ఇంట్లో టీవీలో చూసినా ఒకే రకమైన వినోదాన్ని అందిస్తాయి. కుటుంబ సభ్యులంతా కలిసి చూసే సినిమాలుగా ఆయన చిత్రాలు పేరు సంపాదించాయి. అందుకే టీవీలో ప్రసారం అయినప్పుడు కూడా ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తుంటారు.

చాలా తక్కువ మంది దర్శకులు మాత్రమే తమ సినిమాలను ప్రతి ప్లాట్‌ఫారమ్‌లో విజయవంతం చేయగలుగుతారు. అనిల్ రావిపూడి అలాంటి అరుదైన దర్శకుల్లో ఒకరు. ఆయన సినిమాలు ఎక్కడ విడుదలైనా ఒక ఈవెంట్‌లా మారిపోతాయి.