అభిమానులపై అనిల్ రావిపూడి ఫైర్.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హిట్ మెషిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి వరుస పెట్టి సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.
By: Madhu Reddy | 22 Sept 2026 1:32 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హిట్ మెషిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి వరుస పెట్టి సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. పటాస్ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమైన ఈయన.. ఆ తర్వాత చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయం అందుకోవడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత చేరువయ్యారు. కామెడీ ప్రధానంగా, ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా సినిమాలు చేస్తూ.. ప్రతి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నారు అనిల్ రావిపూడి.
అభిమానులపై అనిల్ రావిపూడి ఫైర్ .
ఒకవైపు తన సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటూనే.. మరొకవైపు బుల్లితెరపై ఇన్ని రోజులు డ్రామా జూనియర్స్ షో కి జడ్జిగా వ్యవహరించిన ఈయన.. ఇప్పుడు సరిగమప షో కి కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అలా నిత్యం సినిమాలు షోలు అంటూ బిజీ బిజీగా గడిపేస్తున్న అనిల్ రావిపూడి.. తాజాగా అభిమానులపై ఫైర్ అవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే?
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఆయన ఒక ఈవెంట్ కోసం వస్తుండగా ఆయనను చూసిన ఆయన అభిమానులలో ఒక వ్యక్తి అనిల్ రావిపూడి కారు దిగగానే కాళ్ళ మీద పడిపోయాడు. ఇక వెంటనే ఫైర్ అయిపోయిన అనిల్ రావిపూడి.. దయచేసి కాళ్లకు మొక్కకండి.. నిలబడి నమస్కారం పెడితే చాలు.. అంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు. మొత్తానికైతే తనపై అభిమానులు ప్రేమతో కాళ్ళ మీద పడి మొక్కే ప్రయత్నం చేయగా.. అవన్నీ తనకు నచ్చవని , సింపుల్గా షేక్ హ్యాండ్ లేదా నమస్కారం పెడితే చాలు అని తన గొప్పతనాన్ని చాటుకున్నారు. మొత్తానికైతే అనిల్ రావిపూడి ఇలా తన అభిమాని ఫైర్ అవడం అందుకు సంబంధించిన వీడియోలు చూస్తుంటే అనిల్ రావిపూడి సింప్లిసిటీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అనిల్ రావిపూడి ప్రస్తుత సినిమాలు..
ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్ , కళ్యాణ్ రామ్ లతో కలిసి జనవరి 12న విడుదల అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి, వెంకటేష్ తరఫున కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా షూటింగ్ కూడా అప్పుడే పూర్తయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక అనిల్ రావిపూడి విషయానికి వస్తే.. తాను తలచుకుంటే ఏదైనా చేయగల సమర్ధుడు అని మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా సమయంలో నిరూపించారు. సాధారణంగా లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార సినిమా ప్రమోషన్స్ కి రావాలి అంటే.. అవతల ఎంత పెద్ద హీరో అయినా సరే ఆమె డోంట్ కేర్ అంటుంది. అలాంటిది నయనతార చేతే సినిమాకి ముందే ప్రమోషనల్ వీడియోలు చేయించారు అంటే.. తన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు అంటూ ఆడియన్స్ కూడా కామెంట్లు చేశారు.. మొత్తానికి అయితే అనిల్ రావిపూడి ఎప్పటికప్పుడు తన వ్యక్తిత్వంతో, సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నారు.
