Begin typing your search above and press return to search.

అనిల్‌కి మళ్లీ అడ్వాన్స్ ఇచ్చిన దిల్‌ రాజు..?

అనిల్ రావిపూడి 2027 సంక్రాంతికి తన సినిమాతో, 2028 సంక్రాంతికి ఎన్టీఆర్‌తో రాబోతున్నాడు. అయితే దిల్ రాజు బ్యానర్‌లో ఆయన సినిమా ఉంటుందా అనే సందేహాలకు శిరీష్ నిర్వహించిన బర్త్‌డే పార్టీతో తెరపడినట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన అడ్వాన్స్‌తో 2029 లేదా 2030లో దిల్ రాజు నిర్మాణంలో అనిల్ సినిమా చేసే అవకాశం ఉంది.

By:  Ramesh Palla   |   26 Nov 2026 11:12 PM IST
అనిల్‌కి మళ్లీ అడ్వాన్స్ ఇచ్చిన దిల్‌ రాజు..?
X

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్స్‌లో అనిల్‌ రావిపూడి ముందు ఉంటాడు అనడంలో సందేహం లేదు. ఆయన చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద దాదాపుగా భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా చివరి రెండు సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్‌ గారు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో సత్తా చాటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు జనవరి 12న మరోసారి రూ.300 కోట్ల వసూళ్ల టార్గెట్‌తో అనిల్ రావిపూడి రాబోతున్నాడు. 2027 సంక్రాంతి బరిలో అనిల్‌ రావిపూడి దిగనున్న విషయం తెల్సిందే. 2027 సంక్రాంతికి జనవరి 12తో రాబోతున్న అనిల్‌ రావిపూడి 2028 సంక్రాంతికి ఎన్టీఆర్‌ సినిమాతో రాబోతున్నట్లుగా కన్ఫర్మ్‌ అయింది. మరి దిల్‌ రాజు సినిమా ఎప్పుడు ఉంటుంది, అసలు ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న సమయంలో బర్త్‌డే పార్టీతో క్లారిటీ వచ్చింది.

దిల్‌ రాజు మీడియా సమావేశం...

కొన్ని రోజుల క్రితం దిల్‌ రాజు తాను డబ్ చేసి విడుదల చేసిన రామాయణ, సీన్‌ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సమయంలో తన గురించి కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాడంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. అదే సమయంలో అనిల్‌ రావిపూడితో తమ బ్యానర్‌లో ఒక సినిమా ఉందని దిల్‌ రాజు ప్రకటించాడు. అది మరీ ఎక్కువ దూరం లేదని, 2028 సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నాడు. హీరో ఎవరు, ఎప్పుడు ప్రారంభం అనే విషయాలను ఆయన వెళ్లడించలేదు. కానీ అనిల్‌ రావిపూడితో ఒక సినిమా మా బ్యానర్‌లో ఉంటుందని మాత్రం దిల్‌ రాజు చెప్పడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. దిల్‌ రాజు ఆ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్‌లో ఎన్టీఆర్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమా అంటూ ప్రకటన వచ్చింది.

ఎన్టీఆర్‌, అనిల్‌ రావిపూడి మూవీ....

నందమూరి కళ్యాణ్ రామ్‌ నిర్మాణంలో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా సినిమా కన్ఫర్మ్‌ కావడంతో అంతా షాక్ అయ్యాడు. దిల్‌ రాజు ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే ఎన్టీఆర్‌తో మూవీ, అది కూడా ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్‌లో అని రావడం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందా అనే చర్చ మొదలైంది. కొందరు దిల్‌ రాజు కాంపౌండ్‌తో అనిల్‌ రావిపూడికి చెడింది. అందుకే దిల్‌ రాజు ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే ఎన్టీఆర్‌తో మూవీని ప్రకటించారు. ఇక పై దిల్‌ రాజు బ్యానర్‌ లో అనిల్‌ రావిపూడి సినిమా ఉండక పోవచ్చు అని మీడియా సర్కిల్స్‌ లో చర్చ జరిగింది. కట్‌ చేస్తే ఇటీవల అనిల్‌ రావిపూడి బర్త్‌డే వేడుకను దిల్‌ రాజు సోదరుడు శిరీష్ భారీ ఎత్తున తన సొంత నివాసంలో నిర్వహించడం చర్చనీయాంశం అయింది. అనిల్‌ రావిపూడితో తమ బ్యానర్‌కు ఎలాంటి విభేదాలు లేవు అనే విషయాన్ని చెప్పడానికి శిరీష్‌ ఈ బర్త్‌ డే పార్టీని హోస్ట్‌ చేసి ఉంటాడని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్‌...

అనిల్ రావిపూడితో సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా సమయంలోనే దిల్‌ రాజు, శిరీష్‌లు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. అది సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం లేదా మరో సినిమా అయినా కావచ్చు అని మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. కనుక అనిల్‌ రావిపూడి 2028 కాకున్నా 2029 లేదా 2030లో అయినా దిల్‌రాజు, శిరీష్ బ్యానర్‌లో సినిమాను చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దిల్‌ రాజు బ్యానర్‌ లో అనిల్ రావిపూడి చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పటికే అడ్వాన్స్ తీసుకుని ఉన్నాడు కనుక మరో సినిమా సైతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంఫర్ట్‌ ఉన్నప్పుడు మరో నిర్మాతను వెతుక్కోవాల్సిన అవసరం ఏంటని గతంలో అనిల్‌ రావిపూడి అన్నాడు. మరి కళ్యాణ్‌ రామ్‌ వద్ద ఎంత వరకు కంఫర్ట్‌ ఉంటుంది, ఎన్టీఆర్‌ సినిమాను ఏ మేరకు కంఫర్ట్‌ తో పూర్తి చేస్తాడు అనేది చూడాలి.