Begin typing your search above and press return to search.

నిర్మాతకు కారు.. ఓ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

నిర్మాతతో అనిల్ రావిపూడి పెట్టిన కండిషన్ ప్రకారం.. ఒకవేళ సినిమా రేంజ్ పెరిగి ఓవర్సీస్‌లో 4 మిలియన్ డాలర్ల మార్క్ ని దాటితే మాత్రం తనకు ఒక విల్లా కొని ఇవ్వాలని ఆయన కోరారు.

By:  M Prashanth   |   14 Jan 2026 1:53 PM IST
నిర్మాతకు కారు.. ఓ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి
X

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి రూపొందించిన 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద పండగ సందడిని ముందే తెచ్చేసింది. సంక్రాంతి సీజన్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లను నింపేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నిర్వహించిన 'మెగా బ్లాక్‌బస్టర్ థాంక్యూ మీట్'లో డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి తన సినిమాలతో కేవలం బాక్సాఫీస్ హిట్లు కొట్టడమే కాకుండా, నిర్మాతలతో కూడా చాలా క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే నిర్మాతలు దర్శకులకు ఖరీదైన కార్లను గిఫ్ట్‌గా ఇవ్వడం మనం చూస్తుంటాం. కానీ అనిల్ రావిపూడి మాత్రం ఈసారి ట్రెండ్‌కు భిన్నంగా తన నిర్మాత సాహు గారపాటితో ఒక క్రేజీ 'బెట్' కట్టినట్లు సక్సెస్ మీట్‌లో సరదాగా వెల్లడించారు.

ఈ సినిమా ఓవర్సీస్ వసూళ్లపై ఉన్న నమ్మకంతో అనిల్ రావిపూడి ఒక వెరైటీ ఛాలెంజ్ విసిరారు. ఒకవేళ ఈ సినిమా ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంటే తానే స్వయంగా నిర్మాతకు ఒక కారు కొని ఇస్తానని అనిల్ రావిపూడి సక్సెస్ మీట్ వేదికగా ప్రకటించారు. అయితే ఇదే ఛాలెంజ్‌లో ఒక ట్విస్ట్ కూడా పెట్టారు. కేవలం నిర్మాతకే కాకుండా తనకు కూడా ఒక భారీ గిఫ్ట్ అందేలా కండిషన్ సెట్ చేశారు.

నిర్మాతతో అనిల్ రావిపూడి పెట్టిన కండిషన్ ప్రకారం.. ఒకవేళ సినిమా రేంజ్ పెరిగి ఓవర్సీస్‌లో 4 మిలియన్ డాలర్ల మార్క్ ని దాటితే మాత్రం తనకు ఒక విల్లా కొని ఇవ్వాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఉన్న వసూళ్ల జోరు చూస్తుంటే ఈ మార్కును దాటడం పెద్ద కష్టమేమీ కాదని అనిల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రేజీ బెట్ గురించి విన్న నెటిజన్లు కూడా అనిల్ రావిపూడికి విల్లా రావడం పక్కా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

వసూళ్ల విషయానికొస్తే, ఈ సినిమా కేవలం 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. సంక్రాంతి హవా ఇప్పుడే మొదలైందని, రాబోయే రోజుల్లో ఈ నంబర్స్ ఇంకా పెరుగుతాయని అనిల్ రావిపూడి ఆశాభావం వ్యక్తం చేశారు. తన కెరీర్‌లో ఇది వరుసగా ఆరోసారి 100 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషమని ఆయన సంతోషంగా చెప్పుకొచ్చారు.

తనపై వచ్చే ట్రోల్స్ గురించి కూడా అనిల్ సక్సెస్ మీట్‌లో చాలా స్పోర్టివ్‌గా స్పందించారు. మీమ్స్ చూస్తూ తాను కూడా హాయిగా నవ్వుకుంటానని, కానీ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని ఇవ్వడమే తన ప్రాధాన్యత అని ఆయన వెల్లడించారు. మెగాస్టార్‌ను వింటేజ్ స్టైల్‌లో చూడాలని కోరుకున్న ఫ్యాన్స్ కోరికను నెరవేర్చగలిగినందుకు తన ఫ్యాన్ బాయ్ హార్ట్ ఎంతో గర్వపడుతోందని అనిల్ రావిపూడి తన మాటల్లో పేర్కొన్నారు.