అదే కాంబో.. అదే సెంటిమెంట్.. అనిల్ మరో హిట్‌కు స్కెచ్ వేసేశాడా?
ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి టైమింగ్, రఘుబాబు స్పెషల్ డైలాగ్ డెలివరీకి అనిల్ రాసే కామెడీ సీన్స్ బాగా సెట్ అవుతాయని ఇప్పటికే పలుమార్లు రుజువైంది.
By: Sravani Lakshmi Srungarapu | 27 Jun 2026 5:00 AM ISTకామెడీని తన సినిమాల ప్రధాన బలంగా మార్చుకుని వరుస సక్సెస్‌లు అందుకుంటున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి తనకు బాగా కలిసి వచ్చిన సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నట్లు టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ ను అందించడంలో ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న అనిల్, ప్రతి సినిమాలో కథకు తగ్గట్టుగానే కామెడీ ట్రాక్‌ను డిజైన్ చేస్తుంటాడు. అందులో భాగంగానే తనకు బాగా వర్కౌట్ అయిన నటీనటులను పదేపదే రిపీట్ చేయడం ఆయనకు అలవాటుగా మారింది. ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌లో కూడా శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు కీలక కామెడీ పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అనిల్ రావిపూడి మరోసారి తన సక్సెస్ కామెడీ ఫార్ములాను నమ్ముకున్నాడనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
అనిల్ కెరీర్‌ను పరిశీలిస్తే ఈ సెంటిమెంట్ కొత్తదేమీ కాదు. తన మొదటి సినిమా పటాస్ నుంచి సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఆ తర్వాత వచ్చిన పలు సినిమాల వరకు శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబులకు కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఇచ్చాడు. కేవలం రెండు మూడు కామెడీ సీన్లకే పరిమితం చేయకుండా, కథను ముందుకు తీసుకెళ్లే క్యారెక్టర్లుగా వారిని ఉపయోగించడం అనిల్ స్పెషాలిటీ అని చెప్పాలి. అదే కారణంగా ఆ క్యారెక్టర్లు ఆడియన్స్ మదిలో నిలిచిపోయాయి.
ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి టైమింగ్, రఘుబాబు స్పెషల్ డైలాగ్ డెలివరీకి అనిల్ రాసే కామెడీ సీన్స్ బాగా సెట్ అవుతాయని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. థియేటర్లలో ఆడియన్స్ పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్న ఎన్నో సీన్స్ ఈ కాంబినేషన్ నుంచే వచ్చాయి. అందుకే ఈ ఇద్దరు మరోసారి అనిల్ సినిమాలో కనిపించబోతున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈసారి వారి పాత్రలు కేవలం కామెడీకే పరిమితం అవుతాయా, లేక కథలో కీలక మలుపులకు కారణమయ్యేలా ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది. అనిల్ గత సినిమాలను చూస్తే, కామెడీని కథతో ముడిపెట్టే విధానానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చాడు. అందువల్ల ఈ కొత్త సినిమాలో కూడా శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు క్యారెక్టర్లు ఎంటర్టైన్మెంట్ తో పాటు కథనానికి కూడా బలం చేకూర్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పైగా వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు తోడు శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు లాంటి అనుభవజ్ఞులైన కమెడియన్లు చేరితే కామెడీ ట్రాక్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. మొత్తానికి అనిల్ రావిపూడి మరోసారి తనకు సక్సెస్‌లు అందించిన కామెడీ టీమ్‌పైనే నమ్మకం ఉంచినట్లు కనిపిస్తోంది. గతంలో ఈ సెంటిమెంట్ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో, వెంకటేష్- కళ్యాణ్ రామ్ సినిమాలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా? థియేటర్లలో మరోసారి నవ్వుల సందడి నెలకొంటుందా? అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.
