మన శంకరవరప్రసాద్.. ఈసారి అనిల్ కు అంత ఈజీ కాదండోయ్!
ప్రస్తుతం అనిల్.. మెగాస్టార్ చిరంజీవితో మనశంకర వరప్రసాద్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాతి రిలీజ్ చేస్తున్నారు.
By: M Prashanth | 28 Sept 2025 6:00 PM ISTగత 10ఏళ్లుగా టాలీవుడ్ లో కామెడీ ఎంటర్టైనర్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు అనిల్ రావిపూడి. పంచ్ డైలాగులు, కామెడీ కామెడీ టైమింగ్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంలో అనిల్ సక్సెస్ అయ్యారు. కొన్నేళ్లుగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లు తెరకెక్కిస్తూ పండగ సీజన్ లో సినిమాలు విడుదల చేస్తున్నారు. అలా పండక్కి వస్తూ హిట్ సాధిస్తున్నారు.
ఈ ఏడాది సంక్రాంతికి విక్టరీ వెంకటేశ్ తో సంక్రాతికి వస్తున్నాం సినిమా తీశారు. రామ్చరణ్ గేమ్ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలతో పోటీగా రిలీజ్ చేశారు. అలాంటి రెండు యాక్షన్ సినిమాలను కాదని, ప్రేక్షకులు అనిల్ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ఊహించని రేంజ్ లో వసూళ్లు సాధించి... పండగ విన్నర్ గా నిలిచింది. ఈసారి కూడా ఆయన అదే ఫార్మూలాతో వస్తున్నారు.
ప్రస్తుతం అనిల్.. మెగాస్టార్ చిరంజీవితో మనశంకర వరప్రసాద్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాతి రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈసారి అనిల్ కు అంత ఈజీ కాకపోవచ్చు. ఎందుకంటే, అదే కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జాన్రాలో మరో రెండు సినిమాలు పొంగల్ ఫైట్ లో ఉండడమే అందుకు కారణం. అందుకే ఈసారి కాంపిటీషన్ ఫుల్ గా ఉండనుంది.
ఈ లైనప్ లో నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, ప్రభాస్ హర్రర్ కామెడీ రాజాసాబ్ సినిమాలు బరిలో ఉన్నాయి. ఇలా ఒకటి కంటే ఎక్కువ సినిమాలు కామెడీ జాన్రాను నమ్ముకొని రావడంతో మార్కెట్ స్పిల్ట్ అవుతుంది. అంటే సినిమాలు మార్కెట్ ను పంచుకుంటాయన్న మాట. ఏ ఒక్క సినిమాకు కూడా వన్ సైడ్ ఆక్యుపెన్సీ ఉండదు.
అందుకే ఈసారి పండగకు ప్రేక్షకులు కామెడీనే కాదు సినిమాలో మరిన్ని ఎలిమెంట్స్ ఉండాలని కోరుకుంటారనడంలో సందేహం లేదు. అది చిరు- అనిల్ సినిమాను ఇరకాటంలో పెట్టవచ్చు. అలా అనిల్ కు ఈ సీజన్ కాస్త భిన్నంగా మారనుంది. అయినప్పటికీ.. అనిల్ - చిరంజీవి కాంబోకు ఉండాల్సిన బజ్ అయితే ఉంది. కేవలం ఇక్కడ అనిల్ డీసెంట్ కంటెంట్ ను డెలివరీ చేయలగితే పొంగల్ ఫైట్ లో మరోసారి విజేతగా నిలిచే ఛాన్స్ ఉంటుంది.
