సంక్రాంతి రిలీజ్.. దసరా నుంచే దరువు ఇస్టార్ట్..!
సంక్రాంతి సినిమాల్లో మాస్ యాక్షన్ కన్నా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూసే ఎంటర్టైనింగ్ సినిమాలకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది.
By: Ramesh Boddu | 1 Oct 2025 12:45 PM ISTసంక్రాంతి సినిమాల్లో మాస్ యాక్షన్ కన్నా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూసే ఎంటర్టైనింగ్ సినిమాలకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అందుకే పొంగల్ రేసులో స్టార్ సినిమాల ఫైట్ లో ఎక్కువ ఎంటర్టైనర్ గా ఉండే సినిమాలే మంచి ఫలితాలు అందుకుంటాయి. ఇక సంక్రాంతికి వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. సంక్రాంతికి అనిల్ సినిమా అంటే అది సూపర్ హిట్ పక్కా అనేలా క్రేజ్ తెచ్చుకున్నాడు.
దసరా నుంచే ప్రమోషన్స్ స్టార్ట్..
నెక్స్ట్ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఐతే ఈ సినిమా రిలీజ్ సంక్రాంతికే అయినా దసరా నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ప్లానింగ్ ఉందట. అనిల్ రావిపూడి సినిమాలు ఎలా ఉంటాయో ఆయన ప్రమోషనల్ కంటెంట్ కూడా అంతే ఇంప్రెసివ్ గా ఉంటాయి. ఈ సినిమా కంపల్సరీ చూడాల్సిందే అనేలా అతని ప్రమోషన్స్ ఉంటాయి.
చిరంజీవితో అనిల్ రావిపూడి చేస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తోనే ఫ్యాన్స్ కి సూపర్ ఫీస్ట్ ఇచ్చింది. ఈ మూవీలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. భీంస్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ కూడా మెగా ఫ్యాన్స్ కి ఫెస్టివల్ వైబ్ తెస్తాయని అంటున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమా ప్రమోషనల్ ప్లానింగ్ తో సర్ ప్రైజ్ చేస్తారని తెలుస్తుంది.
వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసుకునేలా..
సో సంక్రాంతికి రిలీజ్ ఉన్నా కూడా దసరా నుంచే ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారట. తప్పకుండా ఈ సినిమా మరోసారి ఫ్యాన్స్ అంతా వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసుకునేలా ఉంటుందట. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో పాటు వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా కూడా చేస్తున్నాడు. విశ్వంభర సినిమా మాత్రం నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేశారు.
పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు అనిల్ సినిమాలు వరుస హిట్లు అందుకున్నాయి. ముఖ్యంగా అతని సినిమా సంక్రాంతికి వస్తే డెఫినెట్ హిట్ అనేలా ఉంది. మన శంకర వరప్రసాద్ గారు కూడా సంక్రాంతికి సూపర్ సక్సెస్ కొట్టేందుకు వస్తున్నాడు. అనిల్ ఈ సినిమా ప్రమోషన్స్ తోనే సినిమాపై నెక్స్ట్ లెవెల్ బజ్ ఏర్పడేలా చేస్తున్నాడు. అనిల్ రావిపూడి సినిమా అది కూడా సంక్రాంతికి రిలీజ్ కాబట్టి వరప్రసాద్ మీద మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
