Begin typing your search above and press return to search.

చిరూ కోసం ఆ సింగ‌ర్ ను రంగంలోకి దించిన అనిల్

ఇక అస‌లు విష‌యానికొస్తే అనిల్ రావిపూడి ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

By:  Sravani Lakshmi Srungarapu   |   2 Oct 2025 12:50 PM IST
చిరూ కోసం ఆ సింగ‌ర్ ను రంగంలోకి దించిన అనిల్
X

అనిల్ రావిపూడి. టాలీవుడ్ మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్. కెరీర్ స్టార్టింగ్ నుంచి అప‌జ‌య‌మే లేని డైరెక్ట‌ర్ గా అనిల్ కు మంచి పేరుంది. అనిల్ ట్రాక్ రికార్డు చూసి అత‌న్ని అంద‌రూ టాలీవుడ్ హిట్ మిష‌న్ అంటుంటారు. రైట‌ర్ గా కెరీర్ ను మొద‌లుపెట్టిన అనిల్, ఆ త‌ర్వాత ప‌టాస్ సినిమాతో డైరెక్ట‌ర్ గా మారారు. ఎవ‌రైనా స‌రే డైరెక్ట‌ర్ అన్న‌ప్పుడు త‌మ కంటెంట్ తో ఆడియ‌న్స్ ను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటారు.

కానీ అనిల్ మాత్రం కేవ‌లం సినిమాలోని కంటెంట్ తో మాత్ర‌మే కాకుండా క్యాస్టింగ్ నుంచి ప్ర‌మోష‌న్స్ వ‌ర‌కు ప్ర‌తీ విష‌యంలోనూ ఆడియ‌న్స్ ను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే అనిల్ చేసిన ప్ర‌తీ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్ అవ‌డానికి దానికి ఆయ‌న ఎంచుకునే ప్ర‌మోష‌నల్ స్ట్రాట‌జీ కూడా ఓ రీజ‌న్. తాను తీసిన సినిమాను గ్రౌండ్ లెవెల్ లో ఉన్న ఆడియ‌న్స్ వ‌ర‌కు ఎలా తీసుకెళ్లాల‌నేది అనిల్ కు చాలా బాగా తెలుసు.

ఆడియ‌న్స్ అభిరుచిపై అనిల్ కు మంచి ప‌ట్టు

ఆడియ‌న్స్ పైన‌, వారి అభిరుచిపైన అనిల్ కు మంచి ప‌ట్టు ఉంది కాబ‌ట్టే ఆయ‌న సినిమాల‌ను ఆడియ‌న్స్ భారీ స్థాయిలో చూడ‌గ‌లుగుతున్నారు. అనిల్ కు ఉన్న ఆ ప‌ట్టు వ‌ల్లే సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా అంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాలోని గోదారి గ‌ట్టు మీద సాంగ్ కోసం ఎక్క‌డో అమెరికాలో ఉన్న ర‌మ‌ణ గోగుల‌ను ర‌ప్పించి ఆ పాట‌ను పాడించి మ‌రీ దాన్ని చార్ట్‌బ‌స్ట‌ర్ ను చేయ‌డ‌మే కాకుండా ఆ పాట‌కు విపరీత‌మైన ప్ర‌మోష‌న్స్ చేసి సినిమాను ఆడియ‌న్స్ లోకి తీసుకెళ్లారు.

సంక్రాంతికి వ‌స్తున్నాంలో ర‌మ‌ణ గోగుల‌తో సాంగ్

ఇక అస‌లు విష‌యానికొస్తే అనిల్ రావిపూడి ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్ప‌టికే మంచి అంచ‌నాలు నెల‌కొన‌గా, ఈ మూవీలో చిరూకీ జోడీగా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌నతార న‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా కోసం ర‌మ‌ణ గోగుల‌ను ఎలా అయితే తీసుకొచ్చారో ఇప్పుడీ సినిమా కోసం కూడా పాపుల‌ర్ సింగ‌ర్ అయిన ఉదిత్ నారాయ‌ణ్ ను రంగంలోకి దించుతున్నార‌ట అనిల్. గ‌తంలో చిరూ సినిమాల‌కు ఎన్నో పాట‌లు పాడిన ఉదిత్ నారాయ‌ణ్ ఇప్పుడు చాన్నాళ్ల త‌ర్వాత మ‌రోసారి చిరూ కోసం పాట పాడార‌ని తెలుస్తోంది. చూస్తుంటే భీమ్స్ సిసిరోలియో సంక్రాంతికి వ‌స్తున్నాంకు మించిన ఆల్బ‌మ్ ను మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు కోసం రెడీ చేస్తున్న‌ట్టే అనిపిస్తోంది. ఇదంతా విని అనిల్ కు ఇలాంటి ఆలోచ‌న‌లు ఎలా వ‌స్తాయ‌ని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతూ అత‌ని ప్లానింగ్ మామూలుగా లేద‌ని కామెంట్స్ చేస్తున్నారు.