తెలియకుండానే ఆ ఇన్‌ఫ్లుయెన్స్ నాపై పడింది
సినీ ఇండస్ట్రీలో ఉండేవాళ్లంతా అందులో ఉండటానికి ఎంతో కష్టపడుతుంటారు. దాని కోసం ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని, చాలా సమస్యలను అధిగమించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 14 Dec 2025 11:46 AM ISTసినీ ఇండస్ట్రీలో ఉండేవాళ్లంతా అందులో ఉండటానికి ఎంతో కష్టపడుతుంటారు. దాని కోసం ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని, చాలా సమస్యలను అధిగమించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎంత కష్టమొచ్చినా వారు ఇండస్ట్రీని వదలకపోవడానికి కారణం సినిమాపై వారికున్న ఇష్టమే. ఆ ఇష్టం వల్లే ఎన్నో ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేసి మరీ ఇండస్ట్రీలోకి వచ్చి కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
అలా సినిమాలపై ఉన్న పిచ్చి, ఇష్టంతో ఎంతో మంది డైరెక్టర్లు ఇండస్ట్రీకి వచ్చారు. వారిలో కొందరు ఇప్పటికే డైరెక్టర్లు గా మారి సక్సెస్ అయితే, మరికొందరు మాత్రం ఇంకా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ కెరీర్లో ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. టాలీవుడ్ హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా అలానే సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి కెరీర్ ను స్టార్ట్ చేశారు.
చిరంజీవి పాటలకు చిన్నప్పుడు స్కూల్ లో డ్యాన్సులేశా
సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గా కెరీర్ ను కంటిన్యూ చేస్తున్న అనిల్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా మన శంకరవరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ లో అనిల్ రావిపూడి తన చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. తాను చిన్నప్పుడు స్కూల్లో చిరంజీవి పాటలకు డ్యాన్స్ చేశానని, చిరంజీవి గారి సినిమాల్లోని కామెడీ టైమింగ్ తనకు తెలియకుండానే తనపై ఇన్‌ఫ్లుయెన్స్ చూపించిందని చెప్పారు.
క్లాస్ ఫస్ట్ వస్తే సినిమాకు తీసుకెళ్తామన్నారని బాగా చదివి ఫస్ట్ వచ్చా
చిన్నప్పటి నుంచే తాను మూవీ బఫ్‌ని అని చెప్పిన అనిల్, చిన్నప్పుడు తాను 5వ తరగతి చదివే టైమ్ లో క్లాస్ లో ఫస్ట్ వస్తే ఆ వీకెండ్ సినిమాకు తీసుకెళ్తామన్నారని, దాని కోసం బాగా చదివి ఫస్ట్ వచ్చే వాడినని, అలా 52 వారాలు 52 సినిమాలు చూశానని, వాటిలో చిరంజీవి, బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్, నరేష్.. ఇలా అందరి సినిమాలూ ఉండేవని, అక్కడ ఏ సినిమా ఉంటే ఆ సినిమాకు వెళ్లే వాడినని, అలా థియేటర్ వైబ్ తో తాను బాగా కనెక్ట్ అయ్యానని, అందులోనూ ఆ రోజుల్లో చిరంజీవి మాస్ ఆడియన్స్ ను తన సినిమాలతో పిచ్చెక్కించేవారని, కానీ ఆయన రీఎంట్రీ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేయడం వల్ల వింటేజ్ చిరూని మిస్ అయ్యామనిపించే ఆయనకు ఆయన సొంత పేరును పెట్టి ఈ సినిమాను ట్రై చేశానని, ఈ సినిమా ఫస్ట్ నుంచే ఆయన్ని చూసి ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతారని అనిల్ చెప్పుకొచ్చారు.
