Begin typing your search above and press return to search.

అనిల్ రావిపూడి డేట్స్ దొరకడం కష్టమేనా?

టాలీవుడ్‌లో స్టార్ హీరోల క్యాలెండర్లు ఎంత బిజీగా ఉంటాయో, ఇప్పుడు కొందరు స్టార్ డైరెక్ట‌ర్ల‌ షెడ్యూల్స్ కూడా అంతే బిజీగా మారుతున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   27 July 2026 12:43 PM IST
అనిల్ రావిపూడి డేట్స్ దొరకడం కష్టమేనా?
X

టాలీవుడ్‌లో స్టార్ హీరోల క్యాలెండర్లు ఎంత బిజీగా ఉంటాయో, ఇప్పుడు కొందరు స్టార్ డైరెక్ట‌ర్ల‌ షెడ్యూల్స్ కూడా అంతే బిజీగా మారుతున్నాయి. ముఖ్యంగా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి విషయంలో ఇదే డిస్క‌ష‌న్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఒక సినిమా పూర్తవకముందే తదుపరి ప్రాజెక్ట్‌పై హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపుతున్న పరిస్థితి ఏర్పడిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అనిల్ రావిపూడి డేట్స్ కోసం ముందుగానే ప్లాన్స్ రెడీ చేసుకోవాల్సిన అవసరం నిర్మాతలకు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.

గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా మార్కెట్‌లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతున్నప్పటికీ, ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను టార్గెట్ గా చేసుకున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్లకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఆ కేట‌గిరీలో తనకంటూ ప్రత్యేక శైలిని నిర్మించుకున్న డైరెక్ట‌ర్ల‌లో అనిల్ రావిపూడి ముందువరుసలో నిలిచారు. కామెడీ, ఎమోష‌న్స్, మాస్ ఎలిమెంట్స్‌ను సమతూకంగా మిళితం చేసే ఆయన కథనశైలికి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మారుతున్న ఆడియ‌న్స్ అభిరుచికి అనుగుణంగా తన ఫార్ములాలో చిన్నచిన్న మార్పులు చేస్తూ, మెయిన్ కమర్షియల్ అంశాలను మాత్రం కొనసాగించడం ఆయన స‌క్సెస్ కు మెయిన్ రీజ‌న్ అని విశ్లేషకులు చెప్తున్నారు.

ఈ నేపథ్యంలో స్టార్ హీరోల నుంచి కూడా అనిల్ రావిపూడిపై ఆసక్తి పెరుగుతోందనే డిస్క‌ష‌న్ కొన‌సాగుతోంది. ఒకవైపు తమ ఇమేజ్‌కు తగ్గ కథలను అందించగల డైరెక్ట‌ర్‌గా, మరోవైపు షూటింగ్‌ను అనుకున్న టైమ్ కు పూర్తి చేసే మేకర్‌గా ఆయనకు ఉన్న పేరు నిర్మాతల్లో విశ్వాసాన్ని పెంచుతోంది. అందుకే సినిమా మొద‌లుపెట్టడానికి చాలా ముందే అత‌ని డేట్స్‌ను లాక్ చేసే వ్యూహాన్ని నిర్మాణ సంస్థలు అనుసరిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక ప్రాజెక్ట్ లేటైతే దాని ఎఫెక్ట్ త‌ర్వాతి సినిమాల‌పై కూడా పడే అవకాశం ఉండటంతో, లాంగ్‌టర్మ్ ప్లానింగ్‌కు నిర్మాత‌లు ప్రాధాన్య‌మిస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోల డేట్స్ మాత్రమే కాదు, స్టార్ డైరెక్ట‌ర్ల‌ అందుబాటు కూడా కీలక అంశంగా మారుతోంది. ఒక స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ తో సినిమా చేయడం ఇప్పుడు కేవలం క్రియేటివ్ డెసిష‌న్ మాత్రమే కాకుండా, బిజినెస్ స్ట్రాట‌జీగానూ మారిందనే అభిప్రాయం బలపడుతోంది. ఈ పరిస్థితుల్లో అనిల్ రావిపూడి షెడ్యూల్ చుట్టూనే పలువురు హీరోలు, నిర్మాతలు తమ ఫ్యూచ‌ర్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తున్నారనే డిస్క‌ష‌న్ సినీ వర్గాల్లో కొనసాగుతోంది. అందులో భాగంగానే అనిల్ కోసం టాలీవుడ్ లోని ప‌లు అగ్ర నిర్మాణ సంస్థ‌లు క్యూ క‌డుతున్నాయ‌ని, వారిలో కొంద‌రికి అనిల్ ఆల్రెడీ సినిమా చేయ‌డానికి క‌మిట్‌మెంట్ కూడా ఇచ్చార‌ని తెలుస్తోంది.