మరో రిటైర్మెంట్ నటిని తెస్తున్నాడా?
అలాంటి నటిని ఎంతో ఒప్పించి తీసుకొచ్చాడు? అన్నది ప్రచార సమయంలో విజయశాంతి చెబితేనే అర్దమైంది. అటుపై నయనతారను కూడా చిరంజీవి 157వ సినిమా కోసం అలాగే ఒప్పించారు.
By: Srikanth Kontham | 17 Sept 2025 5:19 PM ISTయంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి తన సినిమాల్లో అప్పుడప్పుడు కొన్ని కీలక పాత్రాలకు సీనియర్ నటీమణుల్ని అనూహ్యంగా తెరపైకి తెస్తుంటారు. రిటైర్ అయిపోయి వివిధ రంగాల్లో ఉన్న వారిని కూడా ఒప్పించి తీసుకు రావడం ఆయనకే చెల్లింది. `సరిలేరు నీకెవ్వరులో` లేడీ సూపర్ స్టార్ విజయశాంతి అలాగే ఎంట్రీ ఇచ్చారు. సినిమాలో ఆమెకు బలమైన పాత్ర రాసి ఒప్పించి తీసుకొచ్చాడు అనీల్. అప్పటికే విజయశాంతి సినిమాలకు దూరమయ్యారు. రాజకీయాల్లోకూడా ఏమంత యాక్టివ్ గా లేరు. ప్రశాంతంగా కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు.
ఒప్పించడంలో ఆయన స్పెషలిస్ట్:
అలాంటి నటిని ఎంతో ఒప్పించి తీసుకొచ్చాడు? అన్నది ప్రచార సమయంలో విజయశాంతి చెబితేనే అర్దమైంది. అటుపై నయనతారను కూడా చిరంజీవి 157వ సినిమా కోసం అలాగే ఒప్పించారు. సినిమా ప్రచారమంటే దూరంగా ఉండే నయనతారను ఆ సినిమా ప్రచారంలోనూ భాగం చేసిన ఘనాపాటి అనీల్. దీంతో అనీల్ మంచి డైరెక్టరే కాదు . అంతకు మించి అర్టిస్టులను ఒప్పించి తీసుకురావడంలోనూ స్పెషలిస్ట్ అని ప్రూవ్ అయింది. మరి ఇదే 157వ సినిమా కోసం మరో వెర్సటైల్ యాక్టర్ ని రంగంలోకి దించుతున్నారా? అంటే అవుననే తెలిసింది.
దూరమైన నటి మళ్లీ ఇలా:
సినిమాలో ఆమెను ఓ గెస్ట్ పాత్ర కోసం ఆ నటికి టచ్ లోకి వెళ్లారట. ఇంతకీ ఎవరా నటి అంటే వివరాల్లోకి వెళ్లాల్సిం దే. ఆమె ఎవరో కాదు. అందాల రంభ. ఈమె గురించి ప్రత్యేక పరిచయం అసవరం లేదు. చిరంజీవి, నాగార్జున, వెంక టేష్ , బాలయ్య లాంటి స్టార్ హీరోల సరసన ఎన్నో చిత్రాల్లో నటించారు. 80-90 కాలంలో ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. వివాహం అనంతరం సినిమాల్లో కొంత కాలం కొనసాగారు. గెస్ట్ పాత్రల్లో కనిపించారు.
17 ఏళ్ల పాటు విరామంలోనే:
కానీ అటుపై వాటికి కూడా దూరమయ్యారు. టాలీవుడ్ కు రంభ దూరమై 17 ఏళ్లు అవుతుంది. చివరిగా 2008లో రిలీజ్ అయిన `దొంగ సచ్చినోళ్లు` సినిమా చేసారు. ఆ తర్వాత రంభ కనుమరుగయ్యారు. ఇతర భాషల్లో కొంత కాలం కొన సాగి అక్కడ సినిమాలు మానేసారు. ప్రస్తుతం హిందీలో టీవీ షోలు చేస్తున్నారు. అదీ రేర్ గానే. అలా పరిశ్రమకు దూరమైన రంభను అనీల్ మళ్లీ చిరంజీవి సినిమాలో భాగం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మరి రంభ అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాలి.
