Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరు స్టార్స్ అనిల్ రావిపూడిని కాదన్నారా..?

నెక్స్ట్ మళ్లీ సంక్రాంతికే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వస్తున్నాడు అనిల్ రావిపూడి. కెరీర్ లో ఫస్ట్ టైం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు అనిల్ రావిపూడి.

By:  Ramesh Boddu   |   5 Jan 2026 1:33 PM IST
ఆ ఇద్దరు స్టార్స్ అనిల్ రావిపూడిని కాదన్నారా..?
X

టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా అంటే పక్కా ఎంటర్టైన్ చేస్తాయని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. నెక్స్ట్ మళ్లీ సంక్రాంతికే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వస్తున్నాడు అనిల్ రావిపూడి. కెరీర్ లో ఫస్ట్ టైం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు అనిల్ రావిపూడి.

అల్లు అర్జున్, ఎన్టీఆర్ తో కథ చర్చలు..

ఐతే స్టార్ డైరెక్టర్ గా వరుస హిట్లతో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేయట్లేదు. ఐతే ఇదే విషయం ఆయన్ను అడిగితే అంతకుముందు అల్లు అర్జున్, ఎన్టీఆర్ తో కథ చర్చలు జరిగాయని ఆ టైం లో వాళ్ల అంచనాలకు తగినట్టుగా తాను కథ చెప్పలేదు అందుకే వాళ్లు ఛాన్స్ ఇవ్వలేదని అన్నారు అనిల్ రావిపూడి. ఐతే ఇప్పుడు ఛాన్స్ ఇస్తే దాన్ని మెటీరియలైజ్ చేస్తానని అంటున్నారు అనిల్ రావిపూడి.

ఎలాంటి సినిమా అయినా తీస్తా అయితే దానికి సంబందించి నిర్మాత, హీరో ఇవన్నీ కుదరాలని అన్నారు అనిల్ రావిపూడి. ఐతే ప్రస్తుతం తను ఇలానే కొనసాగిస్తానని స్టార్ సినిమాల గురించి ఆలోచించలేదని అన్నారు.

సంక్రాంతికి తన సినిమా రిలీజ్ అన్నది ఒక సెంటిమెంట్ గా మారిందని. తను తీసిన 8 సినిమాల్లో 4 సినిమాలు సంక్రాంతికి వచ్చి సక్సెస్ అయ్యాయని అన్నారు అనిల్ రావిపూడి. సినిమా పూర్తయ్యాక తనకు అనుకున్న టైం లో రిలీజ్ అయ్యేలా కథ.. దానికి తగిన హీరో డేట్స్ చూసుకుని ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తానని అన్నారు అనిల్ రావిపూడి. సో అనిల్ మన శంకర వరప్రసాద్ గారు తర్వాత మరో సినిమా అది కూడా నెక్స్ట్ సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది.

చిరంజీవితో మన శంకర వరప్రసాద్..

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని సినిమాలు చేస్తున్నారు. సీనియర్ హీరోలైన వెంకటేష్ తో 3 సినిమాలు, బాలకృష్ణ తో ఒక సినిమా చేశాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు చిరంజీవితో మన శంకర వర ప్రసాద్ గారుతో వస్తున్నారు. ఈ సినిమా విషయంలో అనిల్ తన మార్క్ ఎంటర్టైనర్ తో పాటు మెగా ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలు కూడా మిక్స్ చేస్తున్నారు. సంక్రాంతికి ఒక మాస్ ఎంటర్టైనర్ గా ఎం.ఎస్.జి రాబోతుంది. మరి అనిల్ సంక్రాంతి మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

అనిల్ రావిపూడి సినిమా తీయడమే కాదు దాన్ని ఆడియన్స్ లోకి తీసుకెళ్లడంలో కూడా ఇంప్రెస్ చేస్తాడు. కేవలం సినిమా షూటింగ్స్ మాత్రమే చేసే నయనతారతో ఎం.ఎస్.జి కోసం మొదటి నుంచి ప్రమోషన్స్ చేయిస్తున్నాడు అనిల్ రావిపూడి. అలా తన సినిమాను ప్రమోషన్స్ చేయడంలో అనిల్ కొత్త కొత్త ఐడియాలతో అదరగొట్టేస్తాడు.