హీరోగా అనిల్ రావిపూడి.. డాలర్ తో లాక్ చేసిన అలీ!
అలీ డాలర్ ఇవ్వడం చూసిన కమెడియన్ ధనరాజ్ తనకు కూడా కావాలని అడగడంతో, అలీ మరో డాలర్ తీసి ఆయనకు కూడా ఇచ్చారు.
By: Madhu Reddy | 7 Feb 2026 3:39 PM ISTటాలీవుడ్‌లో కామెడీ కింగ్ అలీ అంటేనే ఒక సందడి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల పువ్వులు పూయాల్సిందే. తాజాగా శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'సాంప్రదాయనీ సుప్పినీ సుద్ధపూసనీ' చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకలో అలీ తనదైన శైలిలో రచ్చ చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని ఆటపట్టిస్తూ, అందరి ముందే ఒక అమెరికన్ డాలర్‌తో సినిమా ఆఫర్‌ను లాక్ చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఆ సరదా ముచ్చట్లు మీకోసం.
అనిల్ రావిపూడికి డాలర్ అడ్వాన్స్:
ట్రైలర్ లాంచ్ వేడుకలో అలీ మాట్లాడుతూ.. అనిల్ రావిపూడిని ఉద్దేశించి "నన్ను హీరోగా పెట్టి ఒక సినిమా తీయవా?" అని అడిగారు. దానికి అనిల్ రావిపూడి కూడా అంతే హుషారుగా స్పందిస్తూ "సరే సార్, మరి అడ్వాన్స్ ఇప్పించండి" అని సరదాగా అడిగారు. వెనుకాముందు ఆలోచించకుండా అలీ తన జేబులో నుంచి ఒక అమెరికన్ డాలర్ తీసి అనిల్ చేతిలో పెట్టారు. "ఇండియన్ కరెన్సీ కంటే ఈ డాలర్ అయితేనే బాగుంటుంది" అని అలీ అనడంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ఆ డాలర్‌ను చూసి షాక్ అయిన అనిల్ రావిపూడి, చివరకు నవ్వుతూ "ఖచ్చితంగా ఈ డాలర్ కోసం మీతో ఒక సినిమా చేస్తాను" అని ప్రామిస్ చేయడం విశేషం.
వేదికపై డాలర్ల పంపిణీ.. లయ సందడి:
అలీ డాలర్ ఇవ్వడం చూసిన కమెడియన్ ధనరాజ్ తనకు కూడా కావాలని అడగడంతో, అలీ మరో డాలర్ తీసి ఆయనకు కూడా ఇచ్చారు. ఇది గమనించిన హీరోయిన్ లయ ఊరుకోకుండా "మరి నాకో?" అంటూ సరదాగా అలీ దగ్గరకు వచ్చారు. ఆమె అడగడమే ఆలస్యం అలీ ఒక నోటును ఆమెకు కూడా అందజేశారు. చివరకు ప్రోగ్రాం యాంకర్ కూడా తన వంతుగా అడగడంతో అలీ ఆమెను నిరాశపరచకుండా అక్కడ ఉన్నవారందరికీ మనీ ఇచ్చి హాస్యాన్ని పండించారు. ఒక స్టేజ్ మీద ఇలా డాలర్లతో అడ్వాన్సులు ఇస్తూ అలీ చేసిన హంగామా ఈ వేడుకకే హైలైట్‌గా నిలిచింది.
'సాంప్రదాయనీ సుప్పినీ సుద్ధపూసనీ' టీమ్ సందడి:
శివాజీ, లయ లాంటి సీనియర్ నటులు చాలా కాలం తర్వాత జంటగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ.. సినిమా చాలా సహజంగా, ప్రతి కుటుంబం మెచ్చేలా ఉంటుందని తెలిపారు. అనిల్ రావిపూడి తన ప్రసంగంలో ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు. అలీ, ధనరాజ్ లాంటి ఉద్దండుల కామెడీ టైమింగ్‌తో వేదిక అంతా సందడిగా మారింది. అలీ డాలర్ మ్యాజిక్ వర్కవుట్ అయ్యి నిజంగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో అలీ హీరోగా సినిమా వస్తుందేమోనని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
వేదిక ఏదైనా అలీ తన టైమింగ్‌తో ఆ కార్యక్రమాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తారు. అనిల్ రావిపూడితో ఆయన చేసిన ఈ 'డాలర్ డీల్' కేవలం సరదా కోసమే అయినా, ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది.
