Begin typing your search above and press return to search.

ఎలాంటి హ‌డావిడి లేకుండా బుట్ట‌బొమ్మ‌ బ‌ర్త్ డే పార్టీ

అనిఖా సురేంద్ర‌న్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. మ‌ల‌యాళ న‌టి అయిన అయిన అనిఖా బాల న‌టిగానే కెరీర్ ను స్టార్ట్ చేసింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   29 Nov 2025 7:54 PM IST
ఎలాంటి హ‌డావిడి లేకుండా బుట్ట‌బొమ్మ‌ బ‌ర్త్ డే పార్టీ
X

అనిఖా సురేంద్ర‌న్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. మ‌ల‌యాళ న‌టి అయిన అయిన అనిఖా బాల న‌టిగానే కెరీర్ ను స్టార్ట్ చేసింది. 2010లో మ‌ల‌యాళ సినిమా క‌దా తుడారున్నుతో న‌టిగా ప‌రిచ‌య‌మైన అనిఖా ఆ త‌ర్వాత యెన్నై అరిందాల్, విశ్వాసం లాంటి సినిమాల్లో న‌టించి త‌న యాక్టింగ్ తో అంద‌రినీ మెప్పించింది. 2013లో 5 సుంద‌రిక‌ల్ సినిమాలో త‌న పాత్ర‌కు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కేర‌ళ రాష్ట్ర చ‌ల‌న చిత్ర అవార్డును గెలుచుకున్న అనిఖా త‌ర్వాత కేవ‌లం మ‌ల‌యాళంలోనే కాకుండా త‌మిళ‌, తెలుగు సినిమాల్లో కూడా న‌టిస్తోంది.




21 ఏళ్లు పూర్తి చేసుకున్న బుట్ట‌బొమ్మ‌

తెలుగులో బుట్ట‌బొమ్మ అనే సినిమాను చేసిన అనిఖా రీసెంట్ గా 21 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే త‌న బ‌ర్త్ డే పార్టీని అనిఖా భారీగా కాకుండా త‌న ఇంట్లోనే ఫ్రెండ్స్ తో క‌లిసి చాలా సాదాసీదాగా సెల‌బ్రేట్ చేసుకుంది. ఈ పార్టీలో అంద‌రూ ఎలాంటి హ‌డావిడి లేకుండా చాలా స‌ర‌దాగాగా క‌నిపించారు. మామూలుగా సెల‌బ్రిటీలు ఎవ‌రైనా త‌మ పుట్టిన‌రోజుల‌ను చాలా గ్రాండ గా సెల‌బ్రేట్ చేసుకుంటారు.




కానీ అనిఖా మాత్రం అంద‌రికీ భిన్నంగా చాలా సైలెంట్ గా చేసుకుంది. బ‌ర్త్ డే పార్టీ ఫోటోల‌ను అనిఖా సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా ఆ ఫోటోల్లో బుట్ట‌బొమ్మ బ్లాక్ డ్రెస్ లో కేక్ ప‌క్క‌న నిల‌బ‌డి ఎంతో అందంగా క‌నిపించింది. అంతేకాదు, ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా జ‌రిగిన పార్టీ కావ‌డంతో ఆ ఫోటోలు కూడా చాలా నేచుర‌ల్ గా అనిపిస్తున్నాయ‌ని నెటిజ‌న్లు ఆ ఫోటోల‌కు కామెంట్స్ చేస్తున్నారు.




2025లో క‌లిసి రాని ల‌క్

ఇక కెరీర్ ప‌రంగా చూసుకుంటే అనిఖా సురేంద్ర‌న్ ఈ ఇయ‌ర్ అనుకున్న రిజ‌ల్ట్ ను అందుకోలేక‌పోయింది. ఆల్రెడీ ఈ ఇయ‌ర్ అనిఖా నుంచి రెండు సినిమాలొచ్చాయి. నిల‌వ‌కు ఎన్ మేల్ ఎన్న‌డి కోబ‌మ్, ఇంద్ర అనే తమిళ సినిమాలు రిలీజ‌వ‌గా, ఆ రెండు సినిమాలూ ఆశించిన ఫ‌లితాల్ని అందుకోలేక‌పోయాయి. మ‌రి అనిఖాను స‌క్సెస్ దారిలోకి ఏ సినిమా తీసుకొస్తుందో చూడాలి.