17 వయసులోనే అందరికీ ఇచ్చేసిందట..!
కొన్ని నెలల ముందు వరకు పెద్దగా ఎవరికీ తెలియని అనీత్ పడ్డా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు, స్టార్‌డం ఉన్న హీరోయిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
By: Ramesh Palla | 6 Oct 2025 6:00 PM ISTకొన్ని నెలల ముందు వరకు పెద్దగా ఎవరికీ తెలియని అనీత్ పడ్డా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు, స్టార్‌డం ఉన్న హీరోయిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు కారణం ఒకే ఒక్క మూవీ.. అదే సయ్యారా. మోహిత్ సూరి దర్శకత్వంలో ఒక చిన్న బడ్జెట్ మూవీగా వచ్చిన సయ్యార సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.570 కోట్ల వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే. సరైన ప్రమోషన్, ఇతర భాషల్లో డబ్బింగ్, స్టార్ కాస్ట్, పీఆర్ స్టంట్స్ చేసి ఉంటే ఖచ్చితంగా సయ్యార సినిమా వెయ్యి కోట్ల మూవీగా నిలిచేది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. సయ్యార సినిమాతో హీరోయిన్ అనీత్ పడ్డా మాత్రమే కాకుండా అహాన్ పాండే హీరోగా పరిచయం అయ్యాడు. అనీత్ అంతకు ముందు ఒకటి రెండు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఈ సినిమా ఆమె స్థాయిని పెంచేసింది.
బాలీవుడ్ నిర్మాణ సంస్థలకు ఆడిషన్స్ వీడియో
అనీత్ పడ్డా 17 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని ప్రయత్నాలు చేసిందట. అందుకు గాను ఆమె చాలా మార్గాలు ఎంపిక చేసుకుంది. అందులో ఒకటి ఆన్ లైన్ ద్వారా ఆడిషన్స్‌ను పంపించి, తద్వారా ఆఫర్లు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా అనీత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆన్ లైన్ ద్వారా తాను చేసిన ఈమెయిల్స్ ఎన్నో ఉన్నాయి. దాదాపుగా బాలీవుడ్ నిర్మాణ సంస్థలు 50 నుంచి 70 సంస్థలకు తన షో రీల్ ను షేర్ చేశాను. అంతే కాకుండా తాను ఫిల్టర్స్ పెట్టి తీసుకున్న ఫోటోలను షేర్ చేశాను. చాలా సంస్థల నుంచి కనీసం రిప్లై కూడా రాలేదు. సోషల్ మీడియాలో ఈ విధంగా ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా నాకు ఆఫర్లు రావని నిర్ణయించుకుని చివరకు ఆ ప్రయత్నాలను మానేశాను అంటూ ఇటీవల తాజా ఇంటర్వ్యూలో చెప్పకొచ్చింది.
అనీత్ పడ్డా 17 ఏళ్ల వయసులోనే...
కరోనా సమయంలో తాను ఎన్నో నిర్మాణ సంస్థలకు తన యొక్క ఆడిషన్స్ టేప్స్ ను పంపించాను అంటూ చెప్పుకొచ్చిన అనీత్ పడ్డా ఆ విషయాన్ని తన స్నేహితులకు, తల్లిదండ్రులకు చెప్పలేదు అంది. అంతే కాకుండా ఆన్ లైన్ లో ఉన్న కొన్ని ఫేక్ వెబ్‌సైట్స్ వల్ల తాను మోసపోయినట్లుగానూ చెప్పుకొచ్చింది. ఇప్పటికీ నా యొక్క ఆడిషన్స్ ఫోటోలు, వీడియోలు 50 నుంచి 70 నిర్మాణ సంస్థల వద్ద ఉండే ఉంటాయి అంటూ అనీత్ చెప్పుకొచ్చింది. అవకాశాల కోసం ప్రయత్నాలు ఎలా చేయాలో కూడా తెలియని వారు చాలా మంది ఆన్ లైన్ మోసాలకు గురి కావడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు అదే విధంగా అనీత్ పడ్డా సైతం ఆన్ లైన్ ద్వారా తాను ఆడిషన్స్ వీడియోలను పంపిన సమయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా చెప్పడం మీడియా సర్కిల్స్‌లో బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
కరణ్ జోహార్ నిర్మాణంలో సినిమాలు
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో లక్ కలిసి వస్తుంది. అయితే అప్పటి వరకు ప్రయత్నాలు కొనసాగించాలి అనేది అనీత్ పడ్డా విషయంలో అక్షరాల నిరూపితం అయిందని ఆమె విజయాన్ని గురించి మాట్లాడిన సమయంలో కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ప్రస్తుతం అనీత్ పడ్డాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అంతేకాకుండా ఆమెను ప్రముఖ నిర్మాణ సంస్థలు సైతం నటింపజేసేందుకు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా కరణ్ జోహార్ వంటి ఫిల్మ్ మేకర్, యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు ఆమెతో ఒప్పందాలు చేసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి అనీత్ పడ్డా స్లోగా సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉంది.
