Begin typing your search above and press return to search.

ట్రోలింగ్ మధ్య స్ట్రాంగ్‌గా నిలిచిన అనీత్ పద్దా.. ఇదే అసలు స్టోరీ!

ఫ్యాషన్ ప్రపంచంలో ఒక్క ర్యాంప్ వాక్ కూడా ఎంతటి చర్చకు దారితీస్తుందో తాజా ఉదాహరణగా నిలిచింది లాక్మే ఫ్యాష‌న్ వీక్ వేదిక‌పై యువ న‌టి అనీత్ ప‌ద్దా ఇచ్చిన ఎంట్రీ.

By:  Sravani Lakshmi Srungarapu   |   25 March 2026 8:00 AM IST
ట్రోలింగ్ మధ్య స్ట్రాంగ్‌గా నిలిచిన అనీత్ పద్దా.. ఇదే అసలు స్టోరీ!
X

ఫ్యాషన్ ప్రపంచంలో ఒక్క ర్యాంప్ వాక్ కూడా ఎంతటి చర్చకు దారితీస్తుందో తాజా ఉదాహరణగా నిలిచింది లాక్మే ఫ్యాష‌న్ వీక్ వేదిక‌పై యువ న‌టి అనీత్ ప‌ద్దా ఇచ్చిన ఎంట్రీ. ఈ ఈవెంట్‌లో తొలిసారిగా హెడ్‌లైనర్‌గా పాల్గొన్న ఆమె, తన షో తో పాటూ, స్టైలింగ్ కారణంగా సోషల్ మీడియాలో డిస్క‌ష‌న్స్ కు సెంట‌ర్ పాయింట్ గా మారింది. ఈ ఫ్యాషన్ షోలో అనీత్ ప‌ద్దా ధరించిన బ్లాక్ అండ్ వైట్ అవుట్‌ఫిట్, దానికి జత చేసిన బల్కీ జాకెట్ మొదట దృష్టిని ఆకర్షించినా, ఆ ఆకర్షణ ఎక్కువగా విమర్శల రూపంలో మారింది.

ఫ్యాషన్ అభిమానులు, నెటిజన్లు ఆమె స్టైలింగ్ సెలెక్ష‌న్‌పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఆ డ్రెస్ ఆమె వ్యక్తిత్వానికి సరిపోలలేదని అభిప్రాయపడగా, మరికొందరు ర్యాంప్ ప్రెజెన్స్‌ను కూడా ప్రశ్నించారు. ప్రత్యేకంగా ఆమె వేసుకున్న షూస్, డాంగ్లింగ్ కట్ డీటెయిల్స్‌తో ఉన్న డిజైన్ సోషల్ మీడియాలో ప్రధాన చర్చగా మారింది. ఇవ‌న్నీ క‌లిపి మొత్తం లుక్‌ను అసహజంగా మార్చాయని విమర్శకులు అభిప్రాయపడ్డారు. కొందరు యూజర్లు మరీ అతిశయోక్తిగా స్పందిస్తూ ఆమె లుక్‌ను పెంగ్విన్‌తో పోల్చడం గమనార్హం. ఈ విధమైన ట్రోలింగ్ సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించి మరింత చర్చకు దారితీసింది.

అయితే ఈ విమర్శల మధ్య అనీత్ పద్దా ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం కొందరి ప్రశంసలు అందుకుంది. ర్యాంప్‌పై ఎలాంటి సందేహం లేకుండా, ఎటువంటి తడబాటు లేకుండా ఆమె వాక్‌ను పూర్తి చేయడం త‌న ప్రొఫెషనలిజాన్ని చూపించిందని ఫ్యాషన్ పరిశీలకులు పేర్కొన్నారు. మొదట‌ పెద్ద ఈవెంట్ అయినప్పటికీ ఆమె చూపిన కాన్ఫిడెన్స్ ప్రశంసనీయ‌మ‌ని కొందరు అభిప్రాయపడ్డారు.

అయితే ఈ విష‌యంలో చాలా మంది నెటిజన్లు విమర్శలను నేరుగా అనీత్‌పై కాకుండా డిజైనర్లపై మళ్లించారు. ఈ లుక్ వెనుక ఉన్న స్టైలింగ్ నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఒక నటిగా ఆమె డిజైనర్ ఎంపికను అనుసరించాల్సి వచ్చిందని, అందువల్ల ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరైంది కాదని అభిమానులు వాదిస్తూ అనీత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇది ఆమె మొద‌టి మెయిన్ ర్యాంప్ అనుభవమని గుర్తుచేస్తూ, ఇలాంటి సందర్భాల్లో ప్రయోగాలు సహజమని చెబుతున్నారు. విమర్శలను గౌరవంగా ఎదుర్కొని, తన స్థిరత్వాన్ని నిలబెట్టుకోవడం ద్వారా ఆమె మంచి మెచ్యూరిటీ చూపించిందని మ‌రికొంద‌రు అభినందిస్తున్నారు. ఈ మొత్తం ఘటన ఫ్యాషన్ ప్రపంచంలో రిస్క్‌లు తీసుకోవడం ఎంత ముఖ్యమో, అలాగే సోషల్ మీడియా ప్రతిస్పందనలు ఎంత వేగంగా, ఎంత తీవ్రంగా మారగలవో స్పష్టంగా చూపించింది. ఒక స్టైలింగ్ ఎంపిక ఎలా పెద్ద డిబేట్‌గా మారుతుందో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.