Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : అందాల ఆండ్రియా తగ్గట్లేదుగా..!

తెలుగు ప్రేక్షకులకు తడాఖా సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ ఆండ్రియా. కేవలం నటిగా మాత్రమే కాకుండా ఈమె సింగర్‌గా ఇంకా పలు రకాల ట్యాలెంట్స్‌తో మల్టీ ట్యాలెంటెడ్‌ అనిపించుకుంది.

By:  Ramesh Palla   |   29 Jan 2026 1:50 PM IST
ఫొటోటాక్ : అందాల ఆండ్రియా తగ్గట్లేదుగా..!
X

తెలుగు ప్రేక్షకులకు తడాఖా సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ ఆండ్రియా. కేవలం నటిగా మాత్రమే కాకుండా ఈమె సింగర్‌గా ఇంకా పలు రకాల ట్యాలెంట్స్‌తో మల్టీ ట్యాలెంటెడ్‌ అనిపించుకుంది. పలు అవార్డ్‌లను రివార్డ్‌లను సొంతం చేసుకున్న ఆండ్రియా నటిగా ఇప్పటికీ బిజీగా ఉంది. ఈ ఏడాది ఈమె నటించిన మూడు నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. గత ఏడాదిలో ఈమె ఎక్కువగా కనిపించకున్నా ఈ ఏడాదిలో ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరో వైపు ఇటీవలే నాలుగు పదుల వయసులో పడ్డ ఆండ్రియా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలను వరుసగా షేర్‌ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఆమె ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ కావడం తెలిసిందే. తాజాగా మరోసారి ఆండ్రియా అందాల ఆరబోత ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.





అందాల ఆరబోత ఫోటోలతో...

ఆండ్రియా తాజాగా సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు ఆమె అభిమానులకు కన్నుల విందు చేస్తున్నాయి. బీచ్ లో సేద తీరుతు ఆండ్రియా ఫోటోలకు ఫోజ్‌లు ఇచ్చింది. సాధారణంగానే ముద్దుగుమ్మల ఫోటోలకు మంచి రీచ్ ఉంటుంది. ఇక బీచ్‌ ఫోటోలు అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌ మీడియాలో ఆయా ఫోటోలు తెగ వైరల్‌ కావడం జరుగుతుంది. ఆండ్రియా బీచ్ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఆండ్రియా సొంతం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ విషయం నిజం అన్నట్లుగా ఆండ్రియా అందాల ఆరబోత ఫోటోలు సోషల్‌ మీడియాలో మరోసారి వైరల్‌ అవుతున్నాయి. ఆండ్రియా అందానికి ఫిదా అవుతున్న వారు చాలా మంది సోషల్‌ మీడియా ద్వారా కామెంట్ చేస్తూ ఫోటోలను తెగ షేర్‌ చేస్తు ఉన్నారు.





ఇన్‌స్టాగ్రామ్‌లో ఆండ్రియా...

ఆండ్రియా నాలుగు పదుల వయసులోనూ ఇంత అందంగా ఉంది అంటూ ఫాలోవర్స్‌ మాట్లాడుకుంటున్నారు. సహజంగా అయితే వయసు పెరిగినా కొద్దీ అందం తగ్గుతూ ఉంటుంది. కానీ ఆండ్రియా అందం ఈ విషయంలో రివర్స్ లో పెరుగుతూ వస్తోందని అంటున్నారు. కెరీర్‌ ఆరంభంతో పోల్చితే ఆండ్రియా అందం ఇప్పుడు మరింత ఎక్కువ అయిందని నెటిజన్స్‌ అంటున్నారు. గతంతో పోల్చితే ఆండ్రియా ఇప్పుడు మరింత సన్నగా నాజూకుగా మారింది. అంతే కాకుండా స్టైలిష్ గా కూడా మారింది అంటూ నెటిజన్స్‌ కామెంట్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు, నటిగానూ మంచి బిజీగా ఉన్న ఆండ్రియా మరో పదేళ్ల పాటు ఇదే జోష్ తో ఉంటుంది అంటూ ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఆండ్రియా ఈ మధ్య కాలంలో పాడటంను పక్కన పెట్టిందని, మళ్లీ పాడటం మొదలు పెట్టాలి అంటూ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.





సింగర్‌గా ఆండ్రియా జర్నీ...

కన్నుమ్‌ కన్నుమ్‌ నోకియా పాటతో ఆండ్రియా సింగర్‌గా ఎంట్రీ ఇచ్చింది. హరిష్ జయరాజ్ ఈమెను సింగర్‌గా పరిచయం చేసింది. ఆండ్రియా ఎనిమిది ఏళ్ల వయసులో క్లాసికల్‌ పియానో నేర్చుకుంది. 10 ఏళ్ల వయసులోనే స్టేజ్ షో ఇవ్వడం ద్వారా ఆమె తన జర్నీని మొదలు పెట్టింది. థియేటర్ ఆర్టిస్ట్‌గా మంచి ప్రతిభ కనబర్చినప్పటికీ మొదట సింగర్‌గా ఈమెను గుర్తించారు. ఆ తర్వాత నటిగా ఈమె ఎంట్రీ ఇచ్చింది. ఆ మధ్య కాలంలో ప్రేమ వ్యవహారం కారణంగా వార్తల్లో నిలిచిన ఈమె మళ్లీ వ్యక్తిగత విషయాలతో కాకుండా సినిమాల వార్తలతో మీడియాలో నిలిచింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా ఇప్పటికీ ఈమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయంటే ఆమె ప్రతిభ కారణం అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అందం కంటిన్యూ అయితే మరో పదేళ్లు ఆండ్రియా ఇండస్ట్రీలో దూసుకు పోవడం ఖాయం అని కూడా కొందరు అంటున్నారు.