హీరోయిన్ కు రిలీజ్ కష్టాలు గట్టెక్కెదెలా!
హాట్ లేడీ ఆండ్రియో జర్మేనియా కెరీర్ కోలీవుడ్ లో దేదీప్యమానంగా సాగిపోతుంది. ఓ వైపు నటిగా మరో వైపు గాయనిగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంది.
By: Srikanth Kontham | 23 Aug 2025 3:00 PM ISTహాట్ లేడీ ఆండ్రియో జర్మేనియా కెరీర్ కోలీవుడ్ లో దేదీప్యమానంగా సాగిపోతుంది. ఓ వైపు నటిగా మరో వైపు గాయనిగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంది. మధ్యలో వాణిజ్య ప్రకటనలతోనూ అదనపు ఆదా యం సమకూరుతుంది. ఇలా రెండు చేతులా అమ్మడి సంపాదనకు ఏమాత్రం కొదవలేదు. కానీ ఆండ్రియో నటించిన సినిమాలే రిలీజ్ కాకపోవడం అన్నది నిర్మాతలకు ఇబ్బందిగా మారుతుంది. అవును ఆండ్రి యో జర్మెయా లైనప్ లో ఉన్న సినిమాలను పరిశీలిస్తే సంగతి అర్దమవుతుంది.
నా చేతుల్లో పని కాదు:
ప్రస్తుతం ఆండ్రియా నాలుగు సినిమాల్లో నటిస్తోంది. `పిశాచి` కి సీక్వెల్ గా `పిశాచీ 2` లో నటిస్తోంది. దీన్నీ మిస్కిన్ తెరకెక్కిస్తున్నాడు. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తొలి భాగం `పిశాచి` భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఏర్పడిన బజ్ ఇది. ఈ సినిమా చిత్రీకరణ సహా నిర్మాణానంతర పనులు పూర్తై చాలా కాలమవుతుంది. దాదాపు మూడేళ్లు అవుతుంది. కానీ ఇంత వరకూ రిలీజ్ మాత్రం జరగలేదు. ఎం దుకిలా జరుగుతుంది? అంటే రిలీజ్ నా చేతుల్లో పని కాదంటూ చెప్పుకొచ్చింది.
ఆ సినిమా పరిస్థితి అంతే:
తానే నిర్మాత అయితే గనుక ఎప్పుడో రిలీజ్ చేసేదాన్ని అని తెలిపింది. అయితే ఈ సినిమా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కుంటుంది. ఈ చిత్రాన్ని ప్లయింగ్ హార్ట్ పిక్చర్స్ నిర్మిస్తుంది. సినిమా రైట్స్ విషయం లో కోర్టులో పిటీషన్ దాఖలైంది. రాక్ పోర్ట్ బ్యానర్ కు నాలుగు కోట్లు చెల్లించాలని కోర్టులో పిటీషన్ వేయ డంతో ఆగిపోయింది. ఇదింకా కోర్టు పరిదిలో ఉంది. మూడేళ్ల గా కేసు నడుస్తోంది. ఆ గొడవ తేలే వరకూ పిశాచి రాదు. అలాగే ఆండ్రియో ప్రధాన పాత్రలో `మానుషీ` అనే మరో చిత్రం కూడా తెరకెక్కుతోంది.
మాస్క్ మాత్రమే యాక్టివ్ గా:
ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తయింది. ఇప్పటికే రిలీజ్ అవ్వాలి. కానీ ఇదీ రిలీజ్ కు నోచుకోలేదు. కార ణాలు ఏంటి? అన్నది ఇంత వరకూ తెరపైకి రాలేదు. నోంట్రీ అనే మరో చిత్రం కూడా చాలా కాలంగా ఆన్ సెట్స్ లో నే ఉంది. షూటింగ్ పూర్తయిందా? లేదా? అన్నది క్లారిటీ లేదు. మరో సినిమా `మాస్క్` లోనూ నటి స్తోంది. ఇది మాత్రం సెట్స్ లో యాక్టివ్ గానే ఉంది. మేకర్స్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అంది స్తున్నారు. ఈ సినిమా ఇదే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
