Begin typing your search above and press return to search.

ఆండ్రియా ఈజ్ బ్యాక్.. లైవ్ పెర్ఫార్మెన్స్ తో అదరహో!

ఆండ్రియా జెరేమియా.. ప్రముఖ కోలీవుడ్ నటిగా, గాయనిగా తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఈమె తమిళ్, మలయాళం చిత్రాలలో ఎక్కువగా నటిస్తూ.. భారీ పాపులారిటీ అందుకుంది.

By:  Madhu Reddy   |   21 Sept 2025 3:43 PM IST
ఆండ్రియా ఈజ్ బ్యాక్.. లైవ్ పెర్ఫార్మెన్స్ తో అదరహో!
X

ఆండ్రియా జెరేమియా.. ప్రముఖ కోలీవుడ్ నటిగా, గాయనిగా తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఈమె తమిళ్, మలయాళం చిత్రాలలో ఎక్కువగా నటిస్తూ.. భారీ పాపులారిటీ అందుకుంది. 1985 డిసెంబర్ 21న తమిళనాడు చెన్నైలో జన్మించిన ఈమె మోడల్ గా కెరియర్ ను మొదలుపెట్టి.. నేపథ్య గాయనిగా పేరు దక్కించుకుంది. 'యుగానికి ఒక్కడు' సినిమాతో మంచి పేరు దక్కించుకున్న ఆండ్రియా.. ఆ తర్వాత హీరో సిద్ధార్థ్ తో కలిసి 'గృహం' అనే సినిమాలో చాలా బోల్డ్ సీన్లలో నటించి మతి పోగొట్టింది. తెలుగులో నేరుగా నాగచైతన్య, సునీల్ కాంబినేషన్లో వచ్చిన 'తడాఖా' సినిమాలో నటించి ఆకట్టుకుంది.


కమలహాసన్ విశ్వరూపం సినిమాతో మరింత పాపులారిటీ అందుకున్న ఈమె.. అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. అంతేకాదు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకునే ఆండ్రియా.. చాలా రోజుల తర్వాత మళ్లీ లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. అసలు విషయంలోకి వెళ్తే.. తమిళనాడు చెంగలపట్నం కట్టంకులతూర్ లో ఉన్న ఎస్ఆర్ఎమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలో నిర్వహించిన "#SRMPanacea -2025" ప్రోగ్రాంలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఇందులో తన అద్భుతమైన గాత్రంతో లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చి యువతను ఉర్రూతలూగించింది. సోల్ ఫుల్ వాయిస్ , ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీతో తన పెర్ఫార్మన్స్ తో వేరే లెవెల్ లో అదరగొట్టిందని చెప్పవచ్చు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఒక కాలేజ్ సందర్భంగా ఆండ్రియా ను ఇంత ఎనర్జీటిగ్ గా చూసేసరికి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ఇక ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలను తాజాగా ఆండ్రియా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఆండ్రియా ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఇన్నాళ్లు తన గాత్రానికి అభిమానులను దూరం చేసిన ఈమె.. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మైక్ పట్టి పాటలు పాడడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.క ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


ఆండ్రియా జెరెమియా విషయానికి వస్తే.." కన్నుమ్ కన్నుమ్ నోకియా" అనే పాటతో నేపథ్య గాయనిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తమిళ్ చిత్రం 2007లో వచ్చిన 'పచ్చైకిలి ముత్తుచరం' అనే సినిమా ద్వారా నటిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఈమె కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే తమిళనాడులోని అరక్కోణంలో ఒక ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో ఈమె జన్మించారు. ఈమె తండ్రి మద్రాస్ హైకోర్టులో న్యాయవాది.ఈమెకు ఒక చెల్లెలు కూడా ఉన్నారు.. 8 ఏళ్ల వయసులోనే క్లాసికల్ పియానో నేర్చుకున్న ఈమె.. 10 సంవత్సరాల వయసులో జాక్సన్ ఫైవ్ బృందంలో భాగమై సింగర్ గా పేరు సొంతం చేసుకుంది. రంగస్థలం నాటకాలలో కూడా పాల్గొన్న ఈమె ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో స్టూడెంట్స్ సెనేట్ అధ్యక్షురాలు కూడా..