Begin typing your search above and press return to search.

ఏపీఎల్ ప్రారంభం.. పెద్ది షాట్ తో స్పెషల్ విషెస్ చెప్పిన రామ్ చరణ్!

ఇదిలా ఉండగా.. నేటి నుంచి విశాఖపట్నం క్రికెట్ స్టేడియం లో ఈ టోర్నమెంట్ ను ప్రారంభించనున్నారు.

By:  Madhu Reddy   |   8 Aug 2025 5:15 PM IST
ఏపీఎల్ ప్రారంభం.. పెద్ది షాట్ తో స్పెషల్ విషెస్ చెప్పిన రామ్ చరణ్!
X

దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఎలా అయితే పాపులారిటీ సంపాదించుకుందో.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో యువ ఆటగాళ్ల క్రికెట్ ప్రతిభను వెలికి తీసేందుకు 'ఆంధ్ర ప్రీమియర్ లీగ్' ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రారంభించింది. ఐపీఎల్ కాన్సెప్ట్ లాగే ఈ ఏపీఎల్ టోర్నీ కూడా జరగనుంది. ముఖ్యంగా యువ క్రికెట్ ఆటగాళ్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి ఈ ఏపీఎల్ అతి పెద్ద వేదిక కానుంది అని చెప్పవచ్చు. బీసీసీఐ ఆమోదంతోనే ఇప్పుడు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. నేటి నుంచి విశాఖపట్నం క్రికెట్ స్టేడియం లో ఈ టోర్నమెంట్ ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా విజయవాడ సన్ షైనర్స్ టీమ్ కి రామ్ చరణ్ స్పెషల్ విషెస్ తెలుపుతూ పెద్ది గ్లింప్స్ షాట్ తో ఆల్ ద బెస్ట్ తెలియజేశారు.. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ టీం ను మైత్రి మూవీ మేకర్స్ ఓన్ చేసుకున్న విషయం తెలిసిందే. అటు మైత్రి మూవీ మేకర్స్ తో రామ్ చరణ్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ కారణంతోనే.. 'పెద్ది' సినిమాలోని గ్లింప్స్ షాట్ తో ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు రామ్ చరణ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఎక్స్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముఖ్యంగా ఈ ఏపీఎల్ సీజన్లో ఏడు జట్లు పాల్గొనబోతున్నాయి. అమరావతి రాయల్స్, కాకినాడ కింగ్స్, భీమవరం బుల్స్, రాయలసీమ రాయల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్ షైనర్స్ వంటి టీములు ఈ పోటీలో పాల్గొనబోతున్నాయి. మొత్తం ఇక్కడ 21 లీగ్ మ్యాచులు , 4 ప్లేఆఫ్ లతో ఈ టోర్నీ ఫార్మాట్ ను ప్లాన్ చేశారు. ఏసీఏ యూట్యూబ్ ఛానల్, FanCode యాప్ తోపాటు సోనీ స్పోర్ట్స్ 4, సోనీ స్పోర్ట్స్ 5 వంటి ఛానెల్స్ లో ఈ కార్యక్రమం లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా హీరో వెంకటేష్ వ్యవహరిస్తున్నారు.

రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బుచ్చి బాబు సనా దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఒక సినిమా, సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇక సుకుమార్ తో సినిమా అనడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో 'రంగస్థలం' సినిమా వచ్చి మంచి విజయం అందుకుంది. అందుకే ఇంకో సినిమా అనడంతో అంచనాలు పీక్స్ కి వెళ్ళిపోయాయని చెప్పవచ్చు.