Begin typing your search above and press return to search.

ఆంధ్ర కింగ్ తాలూకా.. భాగ్యతో రామ్ క్యూట్ గా ఇలా..

ఇప్పుడు రామ్, భాగ్యశ్రీ, మహేష్ కలిసి ఉన్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ తీసిన సెల్ఫీని భాగ్యశ్రీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

By:  M Prashanth   |   29 Sept 2025 8:01 PM IST
ఆంధ్ర కింగ్ తాలూకా.. భాగ్యతో రామ్ క్యూట్ గా ఇలా..
X

టాలీవుడ్ యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలుకా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ పి. మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సినిమా పెద్ద ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

ఇప్పుడు రామ్, భాగ్యశ్రీ, మహేష్ కలిసి ఉన్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ తీసిన సెల్ఫీని భాగ్యశ్రీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. AKT(ఆంధ్ర కింగ్ తాలూకా) గ్యాంగ్ అంటూ లవ్ ఎమోజీని యాడ్ చేసి రాసుకొచ్చారు. అయితే సెల్ఫీ అదిరిపోయిందని నెటిజన్లు ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు.

రామ్, భాగ్యశ్రీ డీసెంట్ గా ఉన్నారని, పిక్ లో చాలా బాగున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్.. తన నవ్వుతో అట్రాక్ట్ చేస్తున్నారని అంటున్నారు. అయితే సినిమాలో అభిమానిగా రామ్ కనిపించనుండగా.. భాగ్యశ్రీ బొర్సే కాలేజీ అమ్మాయిగా సందడి చేయనున్నారు. ఇప్పటికే వారి లుక్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

ఇక సినిమా విషయానికొస్తే.. మహేష్ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కన్నడ ప్రముఖ నటుడు ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాలో సినీ హీరో సూర్య కుమార్ గా కనిపించనున్నారు. ఆయన అభిమానిగా రామ్ నటిస్తున్నారు.

మూవీలో రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు సిద్ధార్థ నుని చూసుకుంటున్నారు. ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా వర్క్ చేస్తున్నారు. సంగీత ద్వయం వివేక్, మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

అయితే ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. మ్యూజిక్ లవర్స్ ను విపరీతంగా అలరించాయి. ఓ పాటకు రామ్ లిరిక్స్ అందించగా.. మరో పాటను ఆలపించారు. తద్వారా సినిమా కోసం తన టాలెంట్ మొత్తాన్ని బయటపెట్టారు. మరి నవంబర్ 28వ తేదీన రిలీజ్ కానున్న సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.