'పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా' గుర్తొచ్చింది: వంగలపూడి అనిత
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని- భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన `ఆంధ్రా కింగ్ తాలూకా` నవంబర్ 27న విడుదల కానుంది.
By: Sivaji Kontham | 22 Nov 2025 10:42 PM ISTఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని- భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన `ఆంధ్రా కింగ్ తాలూకా` నవంబర్ 27న విడుదల కానుంది. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీమేకర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రను పోషించారు.
ఈ శనివారం సాయంత్రం వైజాగ్ ఆర్‌కె బీచ్‌లో గ్రాండ్ సంగీత కచేరీని నిర్వహించారు. నటీనటులు ఒక ప్రైవేట్ విమానంలో వైజాగ్‌కు చేరుకున్నారు. రామ్ ఈ చిత్రంలో ఒక సినీ నటుడి అభిమాని అయిన సాగర్ పాత్రలో నటించగా, భాగ్యశ్రీ బోర్సే హీరో ప్రేమికురాలు మహాలక్ష్మిగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి వివేక్-మెర్విన్ సంగీతం అందించారు.
విశాఖ ఆర్కే బీచ్ లో జరిగిన ఈవెంట్లో ముఖ్య అతిథి, తేదేపా నాయకురాలు, మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ-``ఆంధ్రా కింగ్ తాలూకా అనే టైటిల్ వినగానే ఒక విషయం గుర్తుకు వచ్చింది. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, మంగళగిరి ఎమ్మెల్యే తాలూకా.. అంటూ చాలా కాలంగా అభిమానులు చెప్పుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ నాకు అలా కనెక్టయింది`` అని అన్నారు. ఆంధ్రాకింగ్ తాలూకా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా అని అర్థముతోంది. రామ్ ని చూస్తే ఈ అబ్బాయి స్క్రింగులు మింగాడా అనుకునేదానిని.. స్ప్రింగులు కాళ్ల కింద పెట్టుకుని డ్యాన్సులు చేస్తాడనుకునేదానిని... అతడి నటన ఈ సినిమాలో ఆకట్టుకుంటోంది. స్క్రీన్ ముందుండి నటించే హీరోలే కాదు.. బ్యాక్ ఎండ్ లో ఉండి శ్రమించే సాంకేతిక హీరోలకు హ్యాట్సాప్ చెప్పాలి. ఒక సినిమా ని పూర్తి చేయడానికి ఏళ్లు పడుతుంది. అందరూ రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. వర్షం సీన్ కోసం.. సన్ రైజ్ సీన్ కోసం దర్శకులు రేయింబవళ్లు ఎదురు చూసి ఎంతో శ్రమిస్తుంటారు. టీమ్ సభ్యులు టైమ్ లేకుండా కష్టపడతారు. రామ్, భాగ్యశ్రీలను తెరపై అందంగా ఆవిష్కరించారు దర్శకుడు మహేష్.పి.
దర్శకుడు చెప్పినట్టే, నాలో కూడా ఒక ఫ్యాన్ ఉంటాడు తప్పనిసరిగా... పొలిటీషియన్ అయినా కూడా తనలోను ఫ్యాన్ కచ్ఛితంగా ఉంటారు. నా వృత్తిలో కూడా నేను ఎవరో ఒకరికి ఫ్యాన్ అవుతాను. కళామతల్లి ముద్దుబిడ్డలుగా బ్లెస్సింగ్ దక్కడం మీ తల్లిదండ్రుల అదృష్టంగా భావించాలి. జనం థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడండి..అని అన్నారు.
