ఫ్యాన్ బయోపిక్ 'ఆంధ్రా కింగ్'.. అసలు రిఫరెన్స్ ఎవరిది?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లీడ్ రోల్ లో రూపొందిన ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 29 Nov 2025 1:09 PM ISTటాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లీడ్ రోల్ లో రూపొందిన ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మహేష్ బాబు. పి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర, యంగ్ హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు.
ఫ్యాన్ బయోపిక్ గా రూపొందిన ఆంధ్రా కింగ్ తాలూకా మూవీపై రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో అంచనాలు నెలకొనగా.. ఇప్పుడు సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. క్యాస్టింగ్ అందరి యాక్టింగ్ అదిరిపోయిందని, ఓ అభిమాని కథను ఎంతో నిజాయతీగా రాసుకుని సినిమా తీశారని నెటిజన్లు, సినీ ప్రియులు కొనియాడుతున్నారు.
అదే సమయంలో సినిమా ఎవరి నుంచి రిఫరెన్స్ తీసుకుని తెరకెక్కించారోనని మాట్లాడుకుంటున్నారు. క్లైమాక్స్ లోని వచ్చే డైలాగ్ ను ప్రస్తావిస్తున్నారు. అయితే సినిమా మొత్తాన్ని కాస్త క్లియర్ గా చూస్తే.. ఏదో ఒక హీరోనే రిఫరెన్స్ గా తీసుకుని రూపొందించలేదని క్లియర్ గా అర్థమవుతోందని అంటున్నారు. ఎగ్జాంపుల్స్ కూడా చెబుతున్నారు.
ముందుగా క్లైమాక్స్ విషయానికొస్తే.. ఉపేంద్రకు రామ్ షేక్ హ్యాండ్ ఇస్తూ 'మీ హ్యాండ్ చాలా సాఫ్ట్ గా ఉంటుందన్నారు. నిజంగా అలాగే ఉంది' అని చెప్పే డైలాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో మెగాస్టార్ కోసం సునీల్ అప్పట్లో చెప్పిన విషయం గుర్తొచ్చింది. 2002లో జరిగిన ఇంద్ర మూవీ 175 రోజులు వేడుకలో నటుడు సునీల్ అది చెప్పారు.
'చిరంజీవి గారి చెయ్యి పట్టుకుంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది' అని సునీల్ అప్పట్లో చెప్పగా.. ఇప్పుడు రామ్ డైలాగ్ కూడా అదే తరహాలో ఉండడంతో పోలుస్తున్నారు. అలా అని చిరంజీవి రిఫరెన్స్ తో మూవీ తీశారనుకోవడం పొరపాటే. ఎందుకంటే ఆ ఒక్క డైలాగ్ తప్ప మిగతా సీన్స్ కు సంబంధించిన రిఫరెన్సులు కన్ ఫ్యూజ్ చేసేలా ఉన్నాయి!
సినిమాలో ప్రతిజ్ఞ, అగ్నిపుత్రుడు మూవీల పోస్టర్లను చూపించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందులో మేకర్స్ చూపించిన హీరో ఫేస్ ఉపేంద్ర ది. కానీ ఆ రెండు సినిమాల్లో మోహన్ బాబు, నాగార్జున హీరోలుగా నటించారు. అక్కడ వారిద్దరి రిఫరెన్స్ తీసుకున్నట్లే. ఆ తర్వాత కూల్ కోలా, లైమ్ అప్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తారు ఉపేంద్ర.
ఇలాంటి కూల్ డ్రింక్స్ ను ఇప్పటికే టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్ ప్రమోట్ చేశారు. కాబట్టి వారి రిఫరెన్స్ కూడా ఉన్నట్లే. దీని బట్టి చూసుకుంటే.. క్లైమాక్స్ లో వచ్చిన డైలాగ్ తప్ప మిగతా అన్ని రిఫరెన్సులు ఏ ఒక్క హీరోను ప్రత్యేకంగా చూపించేలా లేవు. ఒకే హీరో మీద ఆధారపడి ఉండే కథ కాదని, మొత్తం మీద తెలుగు సినిమా అభిమానుల భావోద్వేగాలను చూపించే ప్రయత్నమే ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ అని స్పష్టంగా అర్థమవుతోంది.
