ఆకాశంలో 'ఆంధ్ర కింగ్' షో.. టాలీవుడ్‌లో ఫస్ట్ టైమ్ ఇలా..
రామ్ పోతినేని 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా ప్రమోషన్స్ మామూలుగా లేవు. సినిమాపై ఉన్న నమ్మకంతో మైత్రీ మూవీ మేకర్స్ ప్రచారంలో సరికొత్త దారులు వెతుకుతున్నారు.
By: M Prashanth | 19 Nov 2025 2:26 PM ISTరామ్ పోతినేని 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా ప్రమోషన్స్ మామూలుగా లేవు. సినిమాపై ఉన్న నమ్మకంతో మైత్రీ మూవీ మేకర్స్ ప్రచారంలో సరికొత్త దారులు వెతుకుతున్నారు. ఇందులో భాగంగా నిన్న కర్నూలులో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఈవెంట్స్ అంటే స్టేజ్ మీద స్పీచ్‌లు కామన్, కానీ ఈసారి టీమ్ అంతకుమించి ఆలోచించింది. ఆకాశాన్ని స్క్రీన్‌గా మార్చేసి ఒక విజువల్ వండర్‌ను క్రియేట్ చేసింది.
ఈ ఈవెంట్‌కు ప్రధాన ఆకర్షణ 'డ్రోన్ షో' అనే చెప్పాలి. టాలీవుడ్ చరిత్రలోనే ఇది మొదటిసారి. దాదాపు 1000కి పైగా డ్రోన్స్‌ను ఉపయోగించి కర్నూలు నైట్ స్కైలో అద్భుతాలు సృష్టించారు. ఒకేసారి వెయ్యి డ్రోన్లు గాల్లోకి ఎగిరి లైట్ల వెలుగులతో రకరకాల ఆకారాలుగా మారుతుంటే, కింద ఉన్న లక్షలాది మంది ఆడియన్స్ మెస్మరైజ్ అయిపోయారు. టెక్నాలజీని ప్రమోషన్స్ కోసం ఇంత క్రియేటివ్ గా వాడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ముఖ్యంగా ఆ డ్రోన్స్ అన్నీ కలిసి ఆకాశంలో సినిమా టైటిల్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' అని తెలుగులో ఫామ్ చేయడం చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత డ్రోన్స్ తోనే సినిమా రిలీజ్ డేట్ ను డిస్ప్లే చేయడం ఈ షోకే హైలైట్‌గా నిలిచింది. స్కైలో ఆ లైటింగ్ ఎఫెక్ట్స్, ఆ ఫార్మేషన్స్ చూస్తుంటే ఏదో ఇంటర్నేషనల్ ఈవెంట్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ డ్రోన్ షో విజువల్సే కనిపిస్తున్నాయి. నైట్ మోడ్‌లో తీసిన వీడియోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. కేవలం ట్రైలర్ లాంచ్ కోసమే నిర్మాతలు ఇంత ఖర్చు పెట్టి, ఇంత గ్రాండ్‌గా ప్లాన్ చేశారంటే సినిమా అవుట్‌పుట్ మీద వారికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కొత్త ఐడియాతో సినిమా బజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
డ్రోన్ షోతో పాటు, విడుదలైన ట్రైలర్‌కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రామ్ పోతినేని మాస్ లుక్, ఎమోషనల్ డైలాగ్స్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఒక అభిమాని కథను చాలా సహజంగా, గుండెకు హత్తుకునేలా చూపించారని టాక్ వినిపిస్తోంది. విజువల్స్ పరంగా డ్రోన్ షో ఆకట్టుకుంటే, కంటెంట్ పరంగా ట్రైలర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది.
కర్నూలు గడ్డపై 'ఆంధ్ర కింగ్' ప్రమోషన్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. వెయ్యి డ్రోన్ల వెలుగులో సినిమా టైటిల్ మెరిసిపోవడం ఒక మెమరబుల్ మూమెంట్. ప్రమోషన్స్‌లోనే ఇంత కొత్తదనం చూపించిన టీమ్, రేపు థియేటర్లలో ఇంకెన్ని సర్ప్రైజ్‌లు ఇస్తుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
