పాజిటివ్ టాక్ కానీ కలెక్షన్స్ నిల్.. మరి ఓటీటీ సంగతేంటి?
ఇదిలా ఉండగా తాజాగా ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లు మాత్రం పెద్దగా రాలేదు.. అయితే అలాంటి సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది.
By: Madhu Reddy | 20 Dec 2025 3:21 PM ISTకొన్ని సినిమాలు థియేటర్లలో నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా .. కలెక్షన్ల పరంగా నిర్మాతలకు లాభాలు తెచ్చి పెడతాయి. అయితే మరికొన్ని చిత్రాలు మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సరే.. సరైన కలెక్షన్లు లేక నిర్మాతలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి చిత్రాలు ఓటీటీలోకి వస్తే అందులో కొన్ని మంచి సక్సెస్ సాధిస్తే.. మరికొన్ని ఆడియన్స్ ను మెప్పించలేక రేటింగ్ లో కూడా వెనకబడిపోతూ ఉంటాయి. ఇదిలా ఉండగా తాజాగా ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లు మాత్రం పెద్దగా రాలేదు.. అయితే అలాంటి సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. మరి ఆ చిత్రం ఏంటో ? ఓటీటీలోకి వస్తే దాని పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం..
అదేదో కాదు ఓ వీరాభిమాని కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర , ప్రముఖ యంగ్ హీరో రామ్ , భాగ్యశ్రీ బోర్సే కథానాయకగా వచ్చిన చిత్రం ఇది. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారం నెట్ ఫ్లిక్స్ వేదికగా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది.
మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో పాజిటివ్ టాకీ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లు మాత్రం పెద్దగా రాలేదు. మరి ఓటీటీలోకి క్రిస్మస్ సందర్భంగా రాబోతున్న ఈ సినిమాకి ఓటీటీ ప్రియులు ఎలాంటి విజయాన్ని అందిస్తారో చూడాలి.
ఇక ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా స్టోరీ విషయానికి వస్తే.. "ఇందులో ఒక అగ్ర కథానాయకుడు సూర్య(ఉపేంద్ర ) తన వందవ సినిమా చేస్తుంటాడు. అభిమానులు ఆయనను ఆంధ్రా కింగ్ గా ఆరాధిస్తుంటారు. అయితే ఈ సినిమా ముందుకు కదలాలి అంటే మూడు కోట్లు అవసరం అవుతాయి. ఎంతో మందిని సూర్య సహాయం కోరతాడు. కానీ ఫలితం లభించదు. చివరికి తాను ఉంటున్న ఇల్లు, కార్లను కూడా అమ్మేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ఈ సంఘర్షణ జరుగుతుండగానే.. ఆయన అకౌంట్ లోకి మూడు కోట్లు జమవుతాయఆ డబ్బు తనకు వీరాభిమాని అయిన సాగర్ అకౌంట్ నుంచి జమ అయినట్లు తేలుతుంది.
ఇకపోతే డబ్బులు సంపాదించే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న తనకు పరిచయం కూడా లేని ఆ అభిమాని డబ్బులు వేయడంతో ఆశ్చర్యానికి గురైన సూర్య.. ఎలాగైనా అభిమానిని కలవాలని బయలుదేరుతాడు. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా ఓ లంక గ్రామానికి చెందిన సాగర్ గురించి సూర్యకు ఎలాంటి విషయాలు తెలిసాయి ఆ తర్వాత సాగర్ మహాలక్ష్మి ప్రేమలో ఎలా పడతారు? అసలు ఆమె ఎవరు? తదితర విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
