Begin typing your search above and press return to search.

ఆంధ్రాకింగ్ కి పిఠాపురానికీ సంబంధమే లేదా?

2024 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి తొలిసారి భారీ మెజార్టీతో గెలిచిన నియోజ‌కవ‌ర్గం కావ‌డంతో? పిఠాపురం ఇండియా అంత‌టా ఫేమ‌స్ అయింది.

By:  Srikanth Kontham   |   25 Nov 2025 5:06 PM IST
ఆంధ్రాకింగ్ కి పిఠాపురానికీ  సంబంధమే లేదా?
X

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా న‌టించిన 'ఆంధ్రా కింగ్ తాలూకా' మ‌రో రెండు రోజుల్లో రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ ప్ర‌క‌ట‌న‌తోనే సినిమాకు మంచి బ‌జ్ క్రియేట్ అయింది. టైటిల్ ట్రెండింగ్ లోనూ నిలిచింది. ఈ టైటిల్ రివీల్ అయిన వెంట‌నే పిఠాపురం తాలూకా స్పూర్తితో తీసుకున్నారా? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. 2024 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి తొలిసారి భారీ మెజార్టీతో గెలిచిన నియోజ‌కవ‌ర్గం కావ‌డంతో? పిఠాపురం ఇండియా అంత‌టా ఫేమ‌స్ అయింది.

అప్ప‌టి వ‌ర‌కూ ఏపీ కే ప‌రిమిత‌మైన పిఠాపురం గురించి దేశ‌మంతా మాట్లాడుకోవ‌డం మొద‌లు పెట్టింది. దీంతో ప‌వ‌న్ అభిమానులు..నియోజ‌క‌వర్గంలో ఫాలోవ‌ర్స్ `పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా` అంటూ చ‌ర్చించుకోవ‌డం..బైక్ నెంబ‌ర్ ప్లేట్ స్థానంలో ఈ పేరు వేయ‌డం జరిగింది. దీంతో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లోనూ నిలిచింది. ఈ నేప‌థ్యంలో రామ్ సినిమాకు టైటిల్ క్యాచీగా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు మ‌హేష్ ఇదే టైటిల్ పెట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆ టైటిల్ కి..పిఠాపురానికి ఎలాంటి సంబంధం లేద‌ని తాజాగా తేల్చేసాడు. ఇది ఉమ్మ‌డి రాష్ట్రానికి సంబంధించి క‌థ‌గా రివీల్ చేసాడు.

క‌థ అప్పుడు రాసుకున్న‌దే. ఈ నేప‌థ్యంలో `ఆంధ్రాకింగ్ తాలూకా` అనే టైటిల్ నిర్ణ‌యించామ‌న్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో జ‌రిగిన ప్ర‌చారానికి...సినిమాకు ఎలాంటి సంబంధం లేద‌ని తేలిపోయింది. రామ్ ని మ‌హేష్ క‌లిసిన‌ప్పుడు 20 నిమిషాలే స‌మ‌యం ఇచ్చాడట‌. ఆ స‌మ‌యంలో క‌థ విని న‌చ్చ‌డంతో మూడు గంట‌లు కేటాయించిన‌ట్లు తెలిపారు. ఆ త‌ర్వాత మైత్రీ మూవీ మేక‌ర్స్ కు చెప్ప‌గా సింగిల్ సిట్టింగ్ లోనే ఒకే చేసిన‌ట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టి పూర్తి చేయ‌డానికి రెండేళ్లు స‌మ‌యం ప‌ట్టింద‌న్నారు.

మ‌హేష్ తొలి సినిమా సందీప్ కిష‌న్ హీరోగా న‌టించిన 'రారా కృష్ణ‌య్య‌'. కానీ ఈ సినిమా అంచ‌నాలు అందుకోలేదు. తొలుత ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాల‌ను కోలేదుట‌. అప్ప‌టి ప‌రిస్థితులు కార‌ణంగా చేసిన‌ట్లు తెలిపారు. కానీ ఆ సినిమా ప్లాప్ అవ్వ‌డం క‌ల‌సొచ్చింద‌న్నాడు. సినిమా హిట్ అయితే గ‌నుక త‌న దారంటే తెలిసేది కాద‌న్నారు. ప్లాప్ త‌ర్వాత త‌న‌కేం కావాలో డిసైడ్ చేసుకున్న‌ట్లు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా విజ‌యం కూడా కీల‌క‌మే. మ‌హేష్ గ‌త సినిమా `మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి` తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.