ఆంధ్రా కింగ్ తాలూకా.. బిగ్ హీరో రియల్ సీన్!
తమ మేకింగ్ తో అందరినీ మెప్పించారు. అంతే కాదు తమ అభిమాన నటుడి కోసం ఎంత దూరమైన ఫ్యాన్స్ వెళతారనేదాన్ని అరటి పళ్ల సీన్ లో చూపించారు.
By: M Prashanth | 30 Nov 2025 11:25 PM ISTఅరటి పళ్ల సీన్.. అదేనండీ ఆంధ్రా కింగ్ తాలూకా మూవీలోని ఆ సన్నివేశం.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లీడ్ రోల్ లో నటించిన ఆంధ్రా కింగ్ తాలుకా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 28వ తేదీన గ్రాండ్ గా విడుదలైంది.
ఫ్యాన్ బయోపిక్ గా రూపొందిన ఆ సినిమాలో కన్నడ నటుడు ఉపేంద్ర హీరో పాత్ర పోషించగా.. ఆయన వీరాభిమానిగా రామ్ కనిపించారు. పి.మహేష్ బాబు దర్శకత్వం వహించి ప్రశంసలు అందుకుంటున్నారు. తమ మేకింగ్ తో అందరినీ మెప్పించారు. అంతే కాదు తమ అభిమాన నటుడి కోసం ఎంత దూరమైన ఫ్యాన్స్ వెళతారనేదాన్ని అరటి పళ్ల సీన్ లో చూపించారు.
ఆంధ్రా కింగ్ తాలూకా మూవీలో రామ్ ఉంటున్న ఊరికి దగ్గరలో ఉపేంద్ర యాక్ట్ చేస్తున్న ఓ సినిమా షూటింగ్ జరుగుతుంది. దీంతో తన అభిమాన నటుడికి అరటి పళ్ళు బాగా ఇష్టమని తెలిసిన రామ్.. చాలా కష్టపడి ఉపేంద్ర మూవీ సెట్స్ దగ్గరకు వెళ్తారు. కొంత పడవ ప్రయాణం చేసి మరీ అరటి పళ్ల గెలను తీసుకెళ్లి ప్రొడ్యూసర్ కు ఇస్తారు.
అయితే సేమ్ ఇలాంటి సీన్.. డైరెక్టర్ మహేష్ నిజజీవితంలో కూడా జరిగింది. ఇక్కడ రామ్ లాగే.. మహేష్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమాని. దీంతో కొన్నేళ్ల క్రితం వైజాగ్ వెళ్లారట పవన్ కళ్యాణ్. అప్పుడు ఆయన ఒక హోటల్ లో బస చేయగా.. స్థానిక ఎమ్మెల్యే పీఏతో మహేష్ కాంటాక్ట్ లో అప్పటికే ఉన్నారట. ఎలా అయినా కలవాలని అనుకున్నారేమో మరి.
ఆ సమయంలో పవన్ కు భోజనం తీసుకెళ్లే ఛాన్స్ ఉందని మహేష్ కు ఆ ఎమ్మెల్యే పీఏ చెప్పారట. దీంతో వెంటనే ఓకే చెప్పిన మహేష్.. పవన్ కు అరటి పళ్లు ఇష్టమని తెలుసుకున్నారు. కానీ వాటిని కొందామంటే ఎక్కడా దొరకలేదు. చాలా కష్టపడి అరటి పళ్లను.. ఒక షాపు వద్ద కొనుగోలు చేశారు. అయితే తక్కువ రేట్ కే ఇచ్చేద్దామని షాప్ వాడు అనుకున్నాడట.
కానీ అవి పవన్ కళ్యాణ్ తింటున్నారు అని పాకెట్ లో ఉన్న డబ్బులను ఆ షాపు వాడికి ఇచ్చారు మహేష్. ఆ తర్వాత అరటి పళ్లు తీసుకుని.. పవన్ కళ్యాణ్ ఉన్న హోటల్ వద్దకు భోజనంతో పాటు ఇచ్చేశారు. ఆ విషయాన్ని ఇప్పుడు మహేష్ బాబునే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన లైఫ్ లో జరిగిన ఆ సంఘటన సినిమాలో యాడ్ చేశానని చెప్పారు. కానీ అప్పుడు పవన్ తాను ఇచ్చిన అరటి పళ్లను తిన్నారో తెలియదని చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి.
