Begin typing your search above and press return to search.

వెబ్ సిరీస్ లో లెస్బియన్ లిప్ లాక్.. ఇప్పుడు చర్చంతా దీనిపైనే

అయితే ఈ సిరీస్ కు స్పందన బాగానే ఉన్నప్పటికీ ఇందులో ఇద్దరు నటీమణుల మధ్య లెస్బియన్ ముద్దు సన్నివేశం ఉంది. ప్రస్తుతం దీని చుట్టే బజ్ తిరుగుతోంది.

By:  M Prashanth   |   17 Aug 2025 3:00 AM IST
వెబ్ సిరీస్ లో లెస్బియన్ లిప్ లాక్.. ఇప్పుడు చర్చంతా దీనిపైనే
X

థ్రిల్లర్- హారర్ వెబ్ సిరీస్ అంధేరా ఆగస్టు 14న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌ లో రిలీజ్ అయ్యింది. ఇందులో ప్రజక్తా కోలి, ప్రియా బాపట్, సుర్వీన్ చావ్లా, వత్సల్ షేత్ కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సిరీస్ కు స్పందన బాగానే ఉన్నప్పటికీ ఇందులో ఇద్దరు నటీమణుల మధ్య లెస్బియన్ ముద్దు సన్నివేశం ఉంది. ప్రస్తుతం దీని చుట్టే బజ్ తిరుగుతోంది.

ఈ వెబ్ సిరీస్ లో లెస్బియన్ కిస్ సీన్ నిమిషాల్లోనే వైరల్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వెబ్ సిరీస్ లో ఇదే తొలి సీజన్. అయితే సిరీస్ చూసిన ప్రేక్షకులు స్టోరీ, నటీనటుల పర్ఫార్మెన్స్, రివ్యూలు చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో అనేక మంది ప్రేక్షకులు సుర్వీన్ చావ్లా- ప్రియా బాపట్ మధ్య లెస్బియన్ ముద్దు సన్నివేశాన్ని ప్రశంసించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సహజంగా కనిపించిందని, సన్నివేశం నేచురల్ గా ఉందని అంటున్నారు.

ఇది ఓటీటీలో క్వీర్ కపుల్ (సేమ్ జెండర్ జోడీ) లో అత్యంత ఆదరణ దక్కించుకుంటుందని కామెంట్ చేస్తున్నారు. యితే ఇలాంటి సీన్ కు ప్రశంసలు ఉన్నట్లే.. విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ లెస్బియన్ సీన్ ను ఓ వర్గం ప్రేక్షకులు అస్సలు అంగీకరించడం లేదు. దీంతో ప్రస్తుతం ఇది కాంట్రవర్సిగానూ మారింది. దరు ఈ సీన్ ను అంగీకరించడం లేదు. ఈ సన్నివేశాన్ని అనవసరమైన LGBTQ+ ప్రచారంగా తోసిపుచ్చారు.

అలాగే ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ షోల్లో ఇటువంటి సీన్స్ అవసరం లేదని వాదిస్తున్నారు. ఈ స్టోరీ లైన్ కాకుండా ఉంటే సిరీస్ వర్కౌట్ అయ్యేదని అభిప్రాయడుతున్నారు. అయితే నెటిజన్లు, ప్రేక్షకుల నుంచి విభిన్న స్వరాలు వినిపిస్తున్నప్పటికీ.. బహుముఖ ప్రాతినిధ్యం ప్రాముఖ్యతను ఇండస్ట్రీలో కొందరు వినిపిస్తున్నారు. ఏ నిర్మాతకైనా విమర్శల కంటే ప్రేక్షకుల స్పందనే ముఖ్యం. ఈ క్రమంలోమే అంధేరా రిలీజ్ అయిన రెండు రోజులకే ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది.