Begin typing your search above and press return to search.

సుమకు మనం గిఫ్ట్స్ ఇవ్వడమేంటి?

స్టార్ యాంకర్ సుమ గురించి అందరికీ తెలిసిందే. దాదాపు 30 ఏళ్లుగా హోస్ట్ గా దూసుకుపోతున్న ఆమె.. ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

By:  M Prashanth   |   31 Jan 2026 12:03 PM IST
సుమకు మనం గిఫ్ట్స్ ఇవ్వడమేంటి?
X

స్టార్ యాంకర్ సుమ గురించి అందరికీ తెలిసిందే. దాదాపు 30 ఏళ్లుగా హోస్ట్ గా దూసుకుపోతున్న ఆమె.. ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల అందరి సినిమాల ఈవెంట్స్ కు ఆమెనే యాంకరింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. హోస్టింగ్ చేయడమే కాకుండా.. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఎలాంటి ఈవెంట్ ను అయినా తన టైమింగ్ అండ్ టాలెంట్ తో హిట్ చేసేస్తారు.

అంతే కాదు.. ఈవెంట్స్ లో ఫన్నీగా ఇంటర్వ్యూలు చేస్తూ నవ్వులు పూయిస్తుంటారు సుమ. సినిమా క్యాస్టింగ్ పై జోకులు.. సెటైర్లు వేస్తూ సందడి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆమెపై యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రీసెంట్ గా ఆయన నిర్మించిన అనగనగా ఒక రాజు మూవీ సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఆ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. పాజిటివ్ టాక్, సూపర్ రివ్యూలతో 100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో మేకర్స్ రీసెంట్ గా రామానాయుడు స్టూడియోస్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన సుమ.. మళ్లీ తనదైన మార్క్ చూపించారు. ఫన్నీ ఇంటర్వ్యూ కూడా చేశారు.

ఆ సమయంలో మూవీ హిట్ అవ్వగానే పికెల్ బాల్ టీమ్ కొంటానని చెప్పారుగా.. ఏం కొంటున్నారని నవీన్ ను సుమ అడగ్గా.. ప్రొడ్యూసర్ ఇచ్చే గిఫ్ట్‌ బట్టి డిసైడ్ చేస్తానని ఆయన తెలిపారు. ఆ తర్వాత తాను నాగ వంశీ దగ్గర రెండు కీలు చూశానని, కారువి అనుకుంటానని సుమ అన్నారు. ఆ కారు తనకు ఇస్తారని, వెనకాల కొత్త టవర్స్ కూడా వస్తున్నాయని నవీన్ పోలిశెట్టి చెప్పారు. అందులో తనకు కొన్ని ఫ్లోర్స్ అని తెలిపారు సుమ.

దీంతో నాగవంశీ రెస్పాండ్ అయ్యి.. ఏంటి ఇందాక నుంచి ఫ్లాట్ కొంటారా? కార్ కొంటారా? అని రెచ్చగొడుతున్నారని సుమను అన్నారు. ఆ తర్వాత మన ఇద్దరికీ నాలుగైదు సినిమాలు ఉంటాయని, కానీ రెండేళ్లకు ఒక మూవీతో వచ్చే నవీన్‌ ను ఎందుకు రెచ్చగొడుతున్నారని క్వశ్చన్ చేశారు. ఆ తర్వాత మనద్దరినీ కలిపి కొంటారని, ఆవిడకి మనం గిఫ్ట్‌లు ఇవ్వడం ఏంటి? అని నవీన్ తో నాగవంశీ అన్నారు.

అప్పుడు అక్కడే ఉన్న సుమ ఒక్కసారిగా షాక్ అయినట్లు కనిపించారు. కానీ ఆమె ఆ తర్వాత.. నాగవంశీ మైక్ ఇచ్చేసి వెళ్లిపోతుండగా ఈ నెల ఈఎంఐ లెక్కలు మొత్తం పంపిస్తానని సెటైర్ వేశారు. దీంతో కార్యక్రమానికి వచ్చిన వారంతా నవ్వేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లను, సినీ ప్రియులను తెగ ఆకట్టుకుని సందడి చేస్తోంది. మరి మీరు చూశారా?